India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ముగ్గురు మంత్రులు ఔట్..!! జగన్ కేబినెట్ లో ఆ స్థానంలో - జెయింట్ కిల్లర్ కు ఖాయం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో మంత్రి పదవుల పైన రకరకాల సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కేబినెట్ ను ప్రక్షాళన చేసే అంశం పైన స్వయంగా సీఎం స్పష్టత ఇచ్చారు. సామాజిక సమీకరణాల్లో కొందరిని కొన సాగించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అయితే, కొత్త జిల్లాల వారీగా సమీకరణాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. అదే సమయంలో..ప్రస్తుత కేబినెట్ లో ఎవరు కొనసాగుతారనే అంశం ఆధారంగా ఇతర వర్గాల వారికి ప్రాధాన్యత దక్కనుంది. కానీ, ప్రస్తుత కేబినెట్ లో అయిదుగురు పేర్లు ఖాయమని ప్రచారం సాగుతోంది. 2019 తొలి కేబినెట్ కూర్పులోనూ ఊహించని విధంగా సమీకరణాలు అమలు చేసారు.

2024 ఎన్నికలే లక్ష్యంగా

2024 ఎన్నికలే లక్ష్యంగా


ఈ సారి 2024 ఎన్నికలు లక్ష్యంగా ఆచి తూచి జగన్ ఎంపిక చేయనున్నారు. అందునా అయిదేళ్ల పాలనలో ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఖాయం. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లో.. వారికి అండగా నిలుస్తున్న వర్గాలను తమ వైపు తిప్పుకోవటంలో జగన్ ఈ సారి కొత్త వ్యూహాలతో మంత్రి పదవులు.. జిల్లా అధ్యక్షుల ఎంపిక చేపట్టనున్నారు. ఏపీలోని ఉభయ గోదావరి జిలాల్లో ఎవరు అధికంగా సీట్లు సాధిస్తే..వారికే అధికారం దక్కటం ఖాయం. 2014, 2019 ఎన్నికల్లోనూ అదే రుజువు అయింది. కానీ, 2019 ఎన్నికల్లో కాపు వర్గాల మద్దతు తమకే ఉంటుందని జనసేన అంచనాలు వేసింది. కానీ, వైసీపీకి ఎక్కువ సంఖ్యలో మద్దతు లభించింది.

మూడు సామాజిక వర్గాలకు తిరిగి ఛాన్స్

మూడు సామాజిక వర్గాలకు తిరిగి ఛాన్స్

దీంతో..ఈ సారి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత కొత్త వ్యూహంతో ముందుకు కదులుతున్నారు. ప్రస్తుత కేబినెట్ లో పశ్చిమ గోదావరి నుంచి ముగ్గురు కేబినెట్ లో మంత్రులుగా ఉన్నారు. కాపు - క్షత్రియ- ఎస్సీ కాంబినేషన్ ను జగన్ ఎంపిక చేసుకున్నారు. ఈ సారి అదే వర్గాలకు తిరిగి ప్రాధాన్య ఇస్తారా మారుస్తారా అనేది చర్చ సాగుతోంది. జిల్లాలో ఉన్న సామాజిక వర్గాల ఆధారంగా తిరిగి అదే మూడు వర్గాలకు మంత్రి పదవులు దక్కుతాయని పార్టీలో చర్చ సాగుతోంది. దీంతో.. క్షత్రియ వర్గం లో తొలి నుంచి జగన్ తో కలిసి అడుగులు వేసిన సీనియర్ ఎమ్మెల్యే ప్రసాద రాజుకు ప్రాధాన్యత దక్కనుంది. అదే విధంగా రెండు గోదావరి జిల్లాల నుంచి కాపు వర్గానికి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాల్సి ఉంది. దీంతో.. కాపు వర్గం నుంచి ప్రస్తుత మంత్రి ఆళ్ల నాని స్థానంలో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పేరు దాదాపు ఖాయమని తెలుస్తోంది.

గ్రంధి శ్రీనివాస్ కు ఖాయమంటూ

గ్రంధి శ్రీనివాస్ కు ఖాయమంటూ

ఆయన ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా అనుభవం ఉంది. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించారు. ఆ సమయంలోనే ఆయనకు మంత్రి పదవి పైన సీఎం జగన్ నుంచి హామీ దక్కిందని తెలుస్తోంది. ఈ సారి సైతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల నుంచి కాకినాడ రూరల్ లేదా తిరిగి భీమవరం నుంచి తిరిగి పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈ సమయంలో ఇప్పుడు గ్రంధి శ్రీనివాస్ కు అవకాశం దక్కనుందని తెలుస్తోంది. ఆయన 2019 ఎన్నికల్లో విజయం ద్వారా జెయింట్ కిల్లర్ గా మారారు.

జగన్ నిర్ణయం ఎలా ఉండబోతోంది

జగన్ నిర్ణయం ఎలా ఉండబోతోంది

ఇక, ఎస్సీ వర్గానికి సైతం ఇక్కడ నుంచి ప్రాధాన్యత లభించనుంది. ఎస్సీ కేటగిరీలో ఈ జిల్లా నుంచి ఒక సీనియర్ నేత పేరు రేసులో ఉంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎస్సీ వర్గానికి ఎంపికయ్యే వారి ఆధారంగా ఆయన బెర్తు ఖరారు కానుంది. ఈ సారి కాపు వర్గానికి తిరిగి నాలుగు మంత్రి పదవులు దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. విశాఖ నుంచి కాపు వర్గానికే కేబినెట్ లో స్థానం దక్కే అవకాశం ఉంది. దీంతో..జగన్ తన కేబినెట్ లో చివరి నిమిషంలో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.


English summary
CM Jagan may replace three ministers in West Godavari. may give chance for Grandhi Srinivas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X