• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ముక్కుతోనే మంత్రముగ్ధుల్ని చేసే చిత్రరాజాలు...విచిత్ర నాసికా చిత్ర‌కారుడు ఇతడే

|

కళ...కల...ఈ రెండింటికీ విడదీయరాని అవినాభావ సంబంధం ఉంటుంది. తాను ఎంచుకున్న కళలో పేరు ప్రఖ్యాతులు ఆర్జించాలని ప్రతి కళాకారుడు కలలు కంటాడు. అయితే అలాంటి వారిలో అతికొద్దిమందే తమ కలను సాకారం చేసుకోగలుగుతారు. విజేతలైన కళాకారులుగా అవతరిస్తారు. అలాంటి ఒక విజయవంతమైన కళాకారుడినే నేడు మనం పరిచయంచేసుకోబోతున్నాం...ఇతడు కేవలం విజేత మాత్రమే కాదు...ఇక ఆ విజయంలో విచిత్రాన్ని కూడా మేళవించిన అద్భుత కళాకారుడు...

మనం చేత్తో బొమ్మని గియ్యాలంటేనే ఎన్నో అవస్థలు పడతాం...ఒకటి గీయాలనుకుంటే అది మరోటిగా అవతరిస్తుంది...అలాంటిది ముక్కునే కుంచెగా మార్చి ముచ్చటైన బొమ్మలు గీస్తున్నాడో కోనసీమ కుర్రాడు...నాసికతోనే అద్భుతమైన చిత్రాల్ని సృష్టిస్తూ అందర్నీ అబ్బురపరుస్తున్నాడు...అలా కళాకారుడు అవ్వాలన్న తన కలను నెరవేర్చుకోవడమే కాదు తన విచిత్ర విద్యతో తోటి చిత్రకారుల్ని సైతం ఆశ్చర్యపరుస్తూ...ఎన్నో రికార్డులు బద్దలు కొట్టడమే కాదు...సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు...తద్వారా తాను ఎంచుకున్న రంగంలో మిగిలిన వారికంటే ఒక మెట్టు పైనే నిలుస్తున్నాడు...ఆ అరుదైన విచిత్ర కళాకారుడి పేరు సత్యవోలు రాంబాబు.

 ఊరు...పేరు...కళ...కల

ఊరు...పేరు...కళ...కల

గోదావరి నీళ్ల మహిమో ఏమో గానీ కోనసీమ కుర్రాళ్లకు కాస్త "కళా సెన్స్" ఎక్కువే ఉంటుంది. అలాంటి వాళ్లలో ఒకరైన మన యువ కళాకారుడు సత్యవోలు రాంబాబుది పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల దగ్గర వేగివాడ అనే గ్రామం. సాధారణంగా అందరు పల్లెటూరు కుర్రాళ్లు కలలు...చదువు పూర్తయ్యాక.. వెంటనే పట్నం వెళ్ళిపోవాలి...అక్కడ ఏ సినిమా యాక్టరో...డైరెక్టరో...లేదా సాఫ్ట్‌వేరు ఇంజనీరో అయిపోవాలి...ఇలా ఉంటాయి. అయితే మన సత్యవోలు రాంబాబు కూడా అందరిలాగానే ఇంటర్‌ అయ్యాక పట్నం వెళ్ళాలనుకున్నాడు. అయితే అదే అందరిలాగా ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరో, సినీ యాక్టరో అవ్వడానికి మాత్రం కానే కాదు...తన కల చిత్రకారుడు కావాలని...తనలోని చిత్రకళకు మరింత మెరుగు పెట్టుకోవాలని..తాను ఒక మంచి చిత్రకారుడిగా పేరుతెచ్చుకోవాలని...అనుకున్నదే తడవుగా...ఇంట్లో వాళ్లు వద్దన్నా...ఇరుగు పొరుగు వాళ్లు వెటకారం చేసినా...భుజాన సంచి తగిలించుకొని...అందులో తన ఆస్తి రెండు మూడు పెన్సిళ్ళు, కొన్ని కాగితాలేసుకుని...హైదరాబాద్‌ రైలెక్కేశాడు.

కట్ చేస్తే...కళాకారుడు అయ్యాడు...కల నిజం చేసుకున్నాడు!...

కట్ చేస్తే...కళాకారుడు అయ్యాడు...కల నిజం చేసుకున్నాడు!...

అక్కడ సీన్ కట్‌చేస్తే...హైదరాబాద్ వచ్చాడు...అనేక కష్టాలు పడ్డాడు...చివరకు అనుకున్నది సాధించాడు...జనాలు అనుకోనిదీ సాధించేశాడు...అద్బుత చిత్రకళాకారుడిగా గుర్తింపు పొందాడు...ఎన్నో రికార్డులు సాధించాడు...మరెందరో ప్రముఖుల ప్రశంసలు పొందాడు...అందరి అభినందనలు అందుకున్నాడు.మిగతా చిత్రకారులకు లభించని ప్రత్యేక గుర్తింపునూ పొందాడు...కారణం...సత్యవోలు సాధారణ చిత్రకారుడు కాదు...అతడు అసాధారణ కళాకారుడు...ఎలాగంటే...అతడు అందరిలా చేత్తో బ్రష్ పట్టుకొని బొమ్మలు గీయడు...మరెలా గీస్తాడంటే...ముక్కుతో గీస్తాడు...అది కూడా అద్భుతంగా గీస్తాడు...అందుకే అతనికి అంత ప్రత్యేకమైన గుర్తింపు...అంతేనా...ఈ అద్భుత కళాకారుడి గురించి తెలుసుకొని ఇతగాడి నాసికాచిత్రాలపై డాక్యుమెంటరీలు చేసేందుకు విదేశీ ప్రసారసాధనాలు పరుగెత్తుకుని ఇండియా కొచ్చేసేంత స్పెషల్ ఆర్టిస్ట్...బిబిసి మనోడి మీద స్పెషల్ డాక్యుమెంటరీ ప్లే చేసేంత గ్రేట్ ఆర్టిస్ట్...ముక్కుతో ఇంత బాగా ఎలా గీస్తున్నావయ్యా అంటూ
మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌, మెగాస్టార్‌ చిరంజీవిలాంటి ప్రముఖులే ముక్కున వేలేసుకొని ఆశ్చర్యపోయేంత వండర్ ఫుల్ ఆర్టిస్ట్...

 ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటే...తన ధైర్యానికి తనకే ఆశ్చర్యం...

ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటే...తన ధైర్యానికి తనకే ఆశ్చర్యం...

కళాకారుడిగా కల సాకారం చేసుకున్నాక...సత్యవోలు రాంబాబు ఒక్కోసారి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకొని తానే ఆశ్చర్యపోతాడు...ఇంటర్ చదివేప్పుడు తోటి స్నేహితులు...బీఈడీ...డిఈడీ అంటే స్కూల్ టీచర్లు అవ్వాలనుకుంటుంటే...తాను మాత్రం బొమ్మలేసే ఆర్టిస్టే కావాలనుకున్న వైనం గుర్తు చేసుకుంటాడు.ఫ్రెండ్స్...ఒరే రాంబాబు.. నవ్వు భలేగా బొమ్మలేసేస్తున్నావోస్...అని భుజాన చేతులేసి...తెగ పొగిడేస్తుండే...ఆ ఆ బొమ్మలేమైనా కూడు బెడతాయా అని ఇంట్లో వాళ్లు తెగిడేస్తుంటే...చిత్ర కళ మీద అవగాహన లేని ఇంట్లో వాళ్ల మాటలతో ఉసూరుమంటూ...ఈ బొమ్మలు కట్టి పెట్టి...గవర్నమెంట్ ఉద్యోగం పట్టమన్న వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక...ఇక సొంత వూరు...కన్న వాళ్లని వదిలి...మది నిండా బొమ్మలపై ధ్యాసతో ఊరొదిలి హైదరాబాద్ నగరం చేరుకున్న రోజులు గుర్తు చేసుకుంటే

 అలా హైదరాబాద్...ఆ తరువాత కష్టాలు...

అలా హైదరాబాద్...ఆ తరువాత కష్టాలు...

అలా హైదరాబాద్...ఆ తరువాత కష్టాలు...చివరకు నిలిచాడు...
అయితే హైదరాబాద్ లోనే కాదు ఎక్కడైనా బొమ్మలేస్తూ బతికేయాలనుకోవడం అంటే మామూలు విషయం కాదు...పైగా బొమ్మలేయడం అంటే సమాజం దృష్టిలో పెద్ద గొప్పేం కాదు...ఆ విషయం...హైదరాబాద్ లో చాలా తొందరగానే అర్ధమైంది మన రాంబాబుకి...ఈ మహానగరంలో బొమ్మలేసే ఆర్టిస్టులు చాలా మందే ఉన్నారని...వాళ్ళు కూడా అచ్చం తనలాగే బొమ్మలంటే వీర పిచ్చితో ఊరొదిలి వచ్చినవాళ్ళేనని ఆ తరువాత తెలిసి భయమేసింది...అయినా సరే తాను బొమ్మలేసే పైకెదగాలని మొండి పట్టుదలతో డిసైడ్ అయ్యాడు. ముక్కుతో చిత్రాలు గీసే తన విద్యకు మరింత మెరుగులు అద్దుకున్నాడు. మరోవైపు తాను అద్దెకుండే చోట ఇరుగుపొరుగు పిల్లలకు బొమ్మలు నేర్పించడం మొదలెట్టాడు. అలా కాస్తంత ఆర్థిక ఆసరా పొందాడు...ఆ తరువాత అలా అలా సర్కిల్ పెరిగి ఫ్రీలాన్స్‌గా బొమ్మలేసే వరకూ ఎదిగాడు...పర్వాలేదు...బొమ్మలు బతికిస్తాయని నమ్మకం తెచ్చుకున్నాడు...ఇంట్లోవాళ్లకు కొడుకు ఎదుగుతున్నాడన్న నమ్మకం కలిగేలా చేయగలిగాడు.

 ఆ తరువాతే...సమ్ థింగ్ స్పెషల్ ఆర్టిస్ట్...

ఆ తరువాతే...సమ్ థింగ్ స్పెషల్ ఆర్టిస్ట్...

అలా రోజులు గడుస్తుండగా హైదరాబాద్‌ మహానగరంలో తానూ ఒక మంచి ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే క్రమంలో వెంకటేశ్వరా ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజ్‌ నుంచి బిఎంఫ్‌ఏ డిగ్రీ కూడా పొందాడు. దాంతో ఆర్టిస్ట్‌గా ఉద్యోగం ఉంది రమ్మంటూ ఎన్నో స్కూళ్లు‌, కాలేజీలు‌, అడ్వర్టైజ్‌మెంట్‌, ప్రింటింగ్ కంపెనీలు పిలిచినా వెళ్ళలేదు. తన సొంత డ్రాయింగ్‌ స్కూల్‌ పెట్టుకున్నాడు. ఇదంతా చెప్పుకున్నంత సులభంగా జరగలేదు...ఈ మధ్యకాలంలో చాలా సినిమా కష్టాలు ఎదుర్కొన్నాడు...ఆ తరువాత అందరిలాగా నేనూ వట్టి బొమ్మలేస్తే నా స్పెషాలిటీ ఏముందీ అనుకున్నాడు...అలా...ఆర్టిస్ట్‌గా ఎవ్వరూ చేయని ప్రక్రియలో వినూత్నంగా బొమ్మలు వేయాలి...అనే ఆలోచన చేశఆడు రాంబాబుకి. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే నాసికా చిత్రం...ముక్కునే కుంచెగా మార్చి...రంగుల్లో ముంచి.. ఆ బ్రష్ లాగా వాడి బొమ్మలు వేయాలనుకోవడం...ఆలోచనైతే బాగుంది...కానీ ఆచరణ సాధ్యమేనా...కానీ పట్టుదల ఉంటే కానిది ఏముంది?... ఆహోరాత్రులు శ్రమించాడు...ముక్కు నొప్పి పుట్టేది...మెడ నొప్పితో అల్లాడేవాడు...కంటి సమస్యలు కూడా వచ్చాయి...

అందరూ వద్దన్నారు...అయినా సాధించాడు...అందుకే విజేత!

అందరూ వద్దన్నారు...అయినా సాధించాడు...అందుకే విజేత!

దీంతో రాంబాబు పరిస్థితి గమనించిన ఇంట్లోవాళ్ళు...స్నేహితులు...శ్రేయోభిలాషులూ...వద్దు ఆపేయమన్నారు...ప్రమాదమని భయపడ్డారు...భయపెట్టారు... కానీ రాంబాబు లెక్కచేయలేదు...అలాగే తన ముక్కు విద్యకు మెరుగులు పెట్టుకున్నాడు...క్రమంగా అందులోనూ పట్టు సాధించాడు...ఆ తరువాత అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు...ప్రపంచంలో ఎవ్వరూ చేయని అత్యంత అరుదైన క్లిష్టమైన ప్రక్రియకు తానే నాంది అయ్యాడు. ఒకవైపు సంప్రదాయ చిత్రాలు వేస్తూనే...మరోవైపు నాసికా చిత్రాలు గీయడంతో సమ్ థింగ్ స్పెషల్ ఆర్టిస్ట్ గా అవతరించాడు...ఆ తరువాత...చరిత్ర లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకునేంత వరకు ఎదిగాడు...ఆ క్రమంలో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం సైతం "రాంబాబు...ది గ్రేట్" అనిపించుకున్నాడు...ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి చేత 'యూ ఆర్‌ వండర్‌ఫుల్‌ ఆర్టిస్టు'...అంటూ ప్రశంసలు అందుకోవడం లాంటి అనేక సందర్భాలు రాంబాబు కళా జీవితంలో కోకొల్లలుగా వచ్చాయి.

 నాసికా చిత్రాలే కాదు...అన్ని ప్రకియల్లో నిపుణుడు...అసలు సిసలు విజేత!

నాసికా చిత్రాలే కాదు...అన్ని ప్రకియల్లో నిపుణుడు...అసలు సిసలు విజేత!

సంప్రదాయ చిత్రాల్లో నేర్పరి...నాసికా చిత్రాల్లో ప్రధముడు...అంతే కాదు వివిధ చిత్రాకళా ప్రక్రియల్లోనూ నిపుణుడు...ఎలాగంటే...రాంబాబు ఆయిల్‌, ఆక్రిలిక్‌, పెన్సిల్‌, వాటర్‌ కలర్‌...ఇలా ఏ ప్రక్రియలోనైనా అద్భుతంగా బొమ్మలు గీయగలడు...అలాంటి అద్భుత చిత్రకారుడైన రాంబాబు...చిత్రకళ గురించి ఏమంటాడంటే..."చిత్రకళ అనేది ఒక అభిరుచిగానే చూడకూడదు. సరియైన ప్రణాళికతో సాధన, అధ్యయనం, విద్యాపరమై అర్హతలు సాధిస్తే.. కచ్ఛితంగా చిత్రలేఖనంలో చక్కటి కెరీర్‌ ఉంది. ఇప్పుడు అన్నిరంగాల్లోనూ చిత్రలేఖనకళ ఆవశ్యకత పెరిగింది. రానున్న రోజుల్లో మరింత డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. చదువుతోపాటు చిత్రకళ విద్యను ఆసరా చేసుకుంటూ ఫ్రీలాన్సర్‌గానూ రాణించవచ్చు"...అని ఔత్సాహికులకు సూచిస్తాడు. కేవలం సలహాలతో సరిపెట్టుకోకుండా తాను నేర్చుకున్న కళ అందరికీ ఏదో ఒకరూపంలో ఉపయోగపడాలి అనే ఆలోచనతో సొంతంగా 'ది సద్గురు స్కూల్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌' పేరుతో పిల్లలకు, చిత్రకళ విద్యార్ధులకు, ఔత్సాహికులకు శిక్షణనిస్తున్నాడు. అంతేకాదు లయన్స్ క్లబ్‌ ప్రతినిధిగా సామాజిక సేవలోనూ ముందున్నాడు. అలా తాను కల కన్న చిత్ర ప్రపంచాన్ని తన స్వయంకృషితో...స్వీయ ప్రతిభతో పదును పెట్టుకొని అసలు సిసలు విజేతగా ఆవిర్భవించాడు...ఇదండీ సత్యవోలు రాంబాబు అనే రంగుల ప్రపంచ విజేత కథ!...విజయ గాథ!

English summary
It is a rare and great artist's life story of Satyavolu Rambabu, who conquered the world with his art . The most important of his specialty is the drawing of paint with nose. Satyavolu Rambabu’s mind is in continuous search of creative techniques. He tried Finger Painting (which is Painting with fingers and can be done either by water colors or in oil Painting media). He enjoys taking risks and in following new methodologies. In late 90s he found a new creative technique called nose painting, initially he found it very hard to use the nose as a brush. Finally he is the only one person in the world who can use his nose as a brush and he produced enormous number of paintings. For this achievement he was rewarded by the Global world record – 2010, India book of records-2012, Telugu book of Records-2013, and also has received appreciation from our former president Honorable Dr.A.P.J.Abdul kalam in person.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X