అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతికి తొలగిన మరో అడ్డంకి, చంద్రబాబుకు ఊరట: నిర్మాణంపై షరతులు

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ -ఎన్జీటీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శుక్రవారం ఊరట లభించింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఎన్జీటీ అనుమతి ఇచ్చింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ -ఎన్జీటీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శుక్రవారం ఊరట లభించింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఎన్జీటీ అనుమతి ఇచ్చింది.

 శుక్రవారం తుది తీర్పు, తోసిపుచ్చిన ఎన్జీటీ

శుక్రవారం తుది తీర్పు, తోసిపుచ్చిన ఎన్జీటీ

రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన నాలుగైదు పిటిషన్లపై విచారించిన ఎన్జీటీ శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. పర్యావరణానికి హాని కలిగిస్తున్నారన్న పిటిషనర్ల అభ్యంతరాలను ఎన్జీటీ తోసిపుచ్చింది.

 మరో అడ్డంకి తొలగింది

మరో అడ్డంకి తొలగింది

పర్యావరణ శాఖ విధించిన 191 నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూనే నిర్మాణాలు సాగాలని చంద్రబాబు ప్రభుత్వానికి ఎన్జీటీ సూచించింది. ఎన్జీటీ తీర్పుతో అమరావతి నిర్మాణానికి మరో పెద్ద అడ్డంకి తొలగినట్లయింది.

రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశం

రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశం

కొండవీడు వాగు దిశ మార్చినా ముంపు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఇంప్లిమెంటేషన్, పర్యేక్షణకు కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ రెండు కమిటీలు నెలకోసారి సమావేశం కావాలని చెప్పింది.

 రెండు కమిటీలు ఏం చేయాలంటే

రెండు కమిటీలు ఏం చేయాలంటే

ఎన్జీటీ సూచనలను అమలు చేయించే బాధ్యతను సూపర్‌వైజర్ (పర్యవేక్షణ) కమిటీకి అప్పగించింది. రోజవారీ కార్యక్రమాల అమలు బాధ్యత ఇంప్లిమెంటేషన్ కమిటీ చూసుకోవాలని చెప్పింది. చిన్న నీటి వాగు ప్రవాహాల మార్గాలకు ఆటంకం కలిగించవద్దని ఎన్జీటీ సూచించింది.

 పిటిషనర్లు ఏం చెప్పారంటే

పిటిషనర్లు ఏం చెప్పారంటే

అలాగే, పర్యావరణ మంత్రిత్వ శాఖ విధించిన 190 నిబంధనలను అమలు చేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. కాగా, అమరావతికి పర్యావరణ అనుమతులు చెల్లవని పిటిషనర్లు గతంలో పిటిషన్ దాఖలు చేశారు. అమరావతికి రాష్ట్ర పర్యాటక శాఖకు అనుమతి లేదని చిత్తడి నేలలు, ఉన్న ప్రాంతంలో రాజధాని వద్దని పిటిషనర్లు తమ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు తీర్పు వచ్చింది.

English summary
National Green Tribunal gave green signal to Andhra Pradesh capital Amaravati building on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X