మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెళ్లికి ముందే టెక్కీ వరుడు పరార్, చితకబాదిన వైనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Groom Techie from Medak goes missing
మెదక్: టెక్కీ అయిన పెళ్లి కొడుకు అదృశ్యం కావడంతో పెళ్లి ఆగిపోయిన సంఘటన ఆదివారం మెదక్ జిల్లా గజ్వెల్‌లో జరిగింది. గజ్వెల్‌లో స్థిరపడిన ఓ కాంట్రాక్టర్ తన కూతురును వరంగల్ జిల్లాకు చెందిన విజయ్ రెడ్డికి ఇచ్చి వివాహం చేసేందుకు నెల రోజుల క్రితం నిశ్చయం చేసుకున్నారు. ఆదివారం పెళ్లి పెట్టుకున్నారు.

ఈ సమయంలో అనూహ్యంగా వరుని అదృశ్యంతో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. చివరకు పెండ్లి కుమారుడు రాలేడని నిర్ధారించుకున్న వధువు బంధువులు వరుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను చితకబాది పోలీసులకు అప్పగించారు. సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాదులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పని చేస్తున్నానంటూ రామకృష్ణపురంకు చెందిన విజయ్ రెడ్డి గజ్వేల్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి కుమార్తెతో నెల క్రితం వివాహం నిశ్చయం చేసుకున్నాడు. అయితే కట్నకానుకల క్రింద రూ.20లక్షలు ఇవ్వడానికి వధువు కుటుంబ సభ్యులు అంగీకరించి అప్పుడే రూ.7.50లక్షలు అప్పజెప్పారు.

ఈ క్రమంలో డిసెంబర్ 19న ఎంగేజ్‌మెంట్ చేసుకోగా, ఈ నెల 9న వివాహ ముహూర్తం ఖరారు చేసుకున్నారు. కట్నం డబ్బుల, బంగారు వస్తువుల కోసం మొదటగా వరుడి తల్లి అరుణ, సోదరి స్వప్నిక, ఇతర బంధువులు గజ్వేల్ చేరుకున్నారు.

పెళ్లి సమయం దగ్గర పడుతున్నప్పటికీ వరుడు రాకపోవడంతో ఆందోళనకు గురైన బాధితులు వారిని నిలదీయడంతో అడ్డదిడ్డంగా సమాధానం ఇచ్చారు. వారు సైతం పరారవడానికి సిద్ధమవుతున్న తరుణంలో పెండ్లివారు పట్టుకొని చితకబాదడంతోపాటు పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం బాధితులు గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

English summary

 Bridegroom went missing on Sunday before marriage at Gajwel city in Medak district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X