• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మరో 4 రోజుల్లో గ్రూప్‌-1, 2 సిలబస్‌...నెలాఖరుకి రిక్రూట్‌మెంట్‌ కేలెండర్‌:ఎపిపిఎస్సి

|

కృష్ణా జిల్లా:రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థాయి ఉద్యోగాలను అందించే గ్రూప్‌-1, గ్రూప్‌- 2 సర్వీసులకు సంబంధించిన తుది సిలబస్‌ మరో నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ పిన్నమనేని ఉదయభాస్కర్‌ వెల్లడించారు.

ఈ సర్వీసులకు సంబంధించి ముసాయిదా సిలబస్ ను నిపుణుల కమిటీకి పంపించామని, పరిశీలన పూర్తికావచ్చిందని ఆయన తెలిపారు. సోమవారం కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్‌ కాలేజీలో నిర్వహించిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెలాఖరు కల్లా రిక్రూట్‌మెంట్‌ కేలెండర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఈ నెలాఖరుకు...రిక్రూట్‌మెంట్‌ కేలెండర్‌

ఈ నెలాఖరుకు...రిక్రూట్‌మెంట్‌ కేలెండర్‌

స్థానిక జీఈసీలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ముగింపు వేడుకలకు ఏపీపీఎస్సీ చైర్మన్‌ పిన్నమనేని ఉదయభాస్కర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేయాల్సిన పోస్టులకు రోస్టర్‌ పాయింట్లతో ఇండెంట్లు పంపించాల్సిందిగా యూనిట్‌ ఆఫీసులకు లేఖలు రాశామన్నారు. యూనిట్‌ ఆఫీసర్లు ఈ నెల 3-4 తేదీల్లో తమ కార్యాలయానికి వచ్చి పలు అంశాలపై వివరణలు తీసుకోవడం కూడా జరిగిందని...ఈ నెలాఖరులో రిక్రూట్‌మెంట్‌ కేలెండర్‌ను విడుదల చేస్తామన్నారు. ఈ సారి దాదాపు 30కి పైగా నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉందని ఉదయ భాస్కర్ చెప్పారు.

ఇస్రోతో...సామాన్యులకు ప్రయోజనాలు

ఇస్రోతో...సామాన్యులకు ప్రయోజనాలు

అంతకుముందు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ముగింపు వేడుకలలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అత్యున్నత సాంకేతికత సామాన్యులకు చేరితేనే దానికి సార్ధకత అని...ఇస్రో చేస్తున్న అంతరిక్ష ప్రయోగాలు, ఉపగ్రహాల ఏర్పాటుతో జనసామాన్యులకు ఆ ప్రయోజనాలు చేరుతున్నాయని చెప్పారు. నేటి తరం మరింత సాంకేతికాభివృద్ధిని సాధించి ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు.

గతంలో అలా...ఇప్పుడు ఇలా

గతంలో అలా...ఇప్పుడు ఇలా

గతంలో కిలోమీటర్ల కొద్దీ దూరం సైకిల్‌పై వెళ్లి గ్యాస్‌సిలెండర్‌ను బుక్‌ చేయాల్సివచ్చేదని...మరి నేడు సెల్‌ఫోన్‌ మెసేజ్‌తో గ్యాస్‌సిలెండర్‌ ఇంటికి వచ్చేస్తుందని, ఇదంతా సమాచార, సాంకేతిక విప్లవమని, దీనికి ఇస్రో చేసిన ఉపగ్రహ ప్రయోగ ఫలితాలే కారణమన్నారు. కానీ ఇవేమీ జనబాహుళ్యానికి తెలియవని, వీటిపై మరింత అవగాన పెంచడానికి ఇలాంటి వారోత్సవాలు ఉపకరిస్తాయని చెప్పారు.

ఆకట్టుకున్న...ప్రదర్శనలు

ఆకట్టుకున్న...ప్రదర్శనలు

కార్యక్రంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన షార్‌ ఉపగ్రహ నమూనాలను, విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను, పోస్టర్‌ ప్రజంటేషన్‌లను, వీడియో ప్రదర్శనలను తిలకించిన ఉదయ భాస్కర్ అనంతరం అతిథులను, షార్‌ శాస్త్రవేత్తలను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక హైస్కూల్‌ విద్యార్థులు షార్‌, ఎస్‌డీఎస్‌సీ, లోగోతో కూడిన ఇస్రో ఆకారంలో ఒదిగి ఆకట్టుకున్నారు.

English summary
Krishna district: APPCC chairman Pinnamaneni Udayabhaskar said that the final syllabus for Group-1 and Group-2 services in will be released in four days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X