వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రూప్ అడ్మిన్లు బీ కేర్ ఫుల్ .. వదంతులు పోస్ట్ చేస్తే అడ్మిన్లకే తిప్పలు .. పోలీసుల వార్నింగ్

|
Google Oneindia TeluguNews

సోషల్ మీడియా.. ఒకరి నుండి ఒకరికి సమాచారం చేరవేసేందుకు ఫేస్ బుక్, వాట్సప్ , ట్విట్టర్ వంటిసోషల్ మీడియా పనికివచ్చే సామాజిక మాధ్యమం అయినా ప్రస్తుత కాలంలో అది చాలా దుర్వినియోగం అవుతుంది. ఫేస్ బుక్ ,వాట్సాప్ లలో ఇష్టారాజ్యంగా తప్పుడు పోస్టులు పెడుతున్నారు. వదంతులను వ్యాపింపజేస్తున్నారు. సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక అలాంటి వారికి చెక్ పెట్టడానికి పోలీసులు నడుంబిగించారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ జనసేనను వీడనున్నారా ? ఆ పార్టీలోకి జంప్ అవుతారా ? సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ జనసేనను వీడనున్నారా ? ఆ పార్టీలోకి జంప్ అవుతారా ?

వదంతులు పోస్ట్ చేస్తే అడ్మిన్ దే బాధ్యత అని పోలీసుల వార్నింగ్

వదంతులు పోస్ట్ చేస్తే అడ్మిన్ దే బాధ్యత అని పోలీసుల వార్నింగ్


ఏ గ్రూపులో అయినా సరే వదంతులు గాని, తప్పుడు పోస్టులు గాని పెడితే అడ్మిన్ లను బాధ్యులను చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

అంతేకాదు తప్పుడు పోస్టు చేసిన పది మందిని అరెస్టు చేసి వారిపై చర్యలు తీసుకోనున్నట్లు గా ప్రకటించారు రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ. ఇతర రాష్ట్రాల నుండి హంతక ముఠాలు వచ్చాయని తప్పుడు వీడియోలను పోస్ట్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అందుకే ఈ ప్రచారంపై టాస్క్ ఫోర్స్, సైబర్ క్రైమ్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ పోస్ట్ లు పెడుతున్న వారి పై నిఘా పెట్టామని పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఇతరుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా మాట్లాడడం, అసభ్యకర పోస్టులు పెట్టడం, బురద జల్లడం వంటి పనులు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు.

మత కలహాలు సృష్టించేలా తప్పుడు పోస్ట్ లు పెట్టిన 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

మత కలహాలు సృష్టించేలా తప్పుడు పోస్ట్ లు పెట్టిన 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఇక గ్రూప్ సభ్యుల్లో అలాంటి వారు ఉంటే , వారు చేసిన పోస్టులకు కూడా గ్రూప్ అడ్మిన్ దే బాధ్యత అని పోలీసులు చెబుతున్నారు.

ఇక ప్రజలు సైతం సామాజిక మాధ్యమాలలో వచ్చే వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలని, ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలుసుకున్న తరువాతనే షేర్ చేయాలని తెలిపారు. ఇక తాజాగా సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం చేస్తున్న పది మందిని అరెస్టు చేసిన పోలీసులు సోషల్ మీడియా వేదికగా వారు చేసిన తప్పుడు ప్రచారాన్ని వివరించారు.హర్యానాలో వరకట్న వేధింపులలో గాయపడిన ఒక మహిళ ఫోటోను అప్లోడ్ చేసి పాతబస్తీలో జైశ్రీరామ్ అందుకు మహిళను ముస్లింలు గాయపరిచారని మతకలహాల సృష్టించే విధంగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఇక ఒకరు చేసిన పోస్ట్ చూసిన మరికొందరు అదే పోస్ట్ ను షేర్ చేశారు.

గ్రూప్ అడ్మిన్లు తస్మాత్ జాగ్రత్త .. గ్రూప్ లో తప్పుడు పోస్టులు పెడితే మీకే తిప్పలు

గ్రూప్ అడ్మిన్లు తస్మాత్ జాగ్రత్త .. గ్రూప్ లో తప్పుడు పోస్టులు పెడితే మీకే తిప్పలు


దీంతో తప్పుడు పోస్ట్ ను షేర్ చేసి మతకలహాల సృష్టించడానికి ప్రయత్నం చేశారన్న కారణంతో పది మందిని అరెస్టు చేసిన పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.

ఏది ఏమైనా ఫేస్ బుక్ , వాట్సాప్ లలో గ్రూప్అడ్మిన్ లు గ్రూప్ సభ్యులు ఏదిబడితే అది పోస్ట్ చేయకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. లేకుంటే గ్రూప్ సభ్యులు చేసిన పోస్టులకు కూడా మీరే బాధ్యులు అవుతారు. ఒకవేళ అవి వదంతులు అయితే, తప్పుడు ప్రచారాలు అయితే, వేరే వ్యక్తిని కించపరిచే పోస్ట్ అయితే చట్టరీత్యా మీకే శిక్ష పడుతుంది అని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

English summary
Ramagundam police commissioner V Satyanarayana has warned that if any group of social media or rumors or misleading posts are put in place, the administrators will be held accountable.The task force, cybercrime and special branch police have been keeping a close watch on those who post these messages, saying that they are terrorizing the public by posting fake videos of murderers from other states. The social media platform has been warned to be harsh on those who speak out, defamatory posts and mudslides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X