వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వ శాఖల్లో పెరుగుతున్న అవినీతి..! ఏమౌతోంది అదికారుల నిజాయితీ..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : ప్రభుత్వ పెద్దలు చెప్తున్న దానికి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి పొంతనే లేకేండా ఉంది తెలంగాణ అదికారుల పరిస్థితి. ప్రభుత్వ శాఖలు నిజాయితీగా పనిచేస్తున్నాయి. ప్రతి విభాగంలో పారదర్శకత పెరుగుతోంది. ప్రజావసరాల నిమిత్తం ఏ పనైనా పైసా ఖర్చు లేకుండా జరిగిపోతోందని ఉన్నతాధికారుల ప్రచారం సాగుతూనే ఉంది. కానీ వాస్తవాలు దానికి భిన్నంగా ఉన్నాయి. ఇటీవల ఏసీబీకి ప్రభుత్వ ఉద్యోగులు పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ ఉద్యోగం, భారీగా జీతభత్యాలు ఉన్నప్పటికీ కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారు. పనుల నిమిత్తం కార్యాలయాలకు వెళ్లిన ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. కొంతమంది ముందుకు వచ్చి ఏసీబీకి సమాచారం ఇస్తే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడుతున్నారు.

 ఏశాఖ చూసినా లంచాల కంపే..! కాలయాపన చేసి మరీ అవినీతికి పాల్పడుతున్న అదికారులు..!!

ఏశాఖ చూసినా లంచాల కంపే..! కాలయాపన చేసి మరీ అవినీతికి పాల్పడుతున్న అదికారులు..!!

ఒకప్పుడు నెలల వ్యవధిలో ఒకటి రెండు మాత్రమే ఏసీబీ కేసులు నమోదయ్యేవి. ప్రజల్లో వచ్చిన చైతన్యం, వారిలో పెరుగుతున్న అవగాహన వల్ల ప్రభుత్వ త్వరగా అయ్యే పనిని కాలయాపన చేసి డబ్బులు ఇస్తేనే పూర్తవుతుందనేలా చేస్తున్నారు. తమ పని పూర్తి చేసుకోవాలన్న కారణంగా చాలామంది అధికారులు అడిగినంత డబ్బు ఇస్తున్నారు. కొద్దిమంది మాత్రం ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు.కార్యాలయాల పనితీరు గురించి తెలుసుకుంటున్నారు. ఫ్రీగా లేదా ఫీజుల రూపంలో మాత్రమే చెల్లించి పనులు చేయించుకోగలుగుతున్నారు. లంచం డిమాండ్‌ చేసిన వారిని పట్టించేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.

 లంచం తీసుకుంటూ పట్టుబడిన వారు..! నెల రోజుల్లో ఏసీబీకి చిక్కిన 9 మంది ఉద్యోగులు..!!

లంచం తీసుకుంటూ పట్టుబడిన వారు..! నెల రోజుల్లో ఏసీబీకి చిక్కిన 9 మంది ఉద్యోగులు..!!

28 మే: రంగారెడ్డి జిల్లా, మియాపూర్‌ ఏడీఈ డి. రమేశ్‌ సబ్‌ ఇంజనీర్‌ పాండు సాయంతో 3500 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.హైదరాబాద్‌, గోషామహల్‌ డివిజన్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ మహమ్మద్‌ అహ్మద్‌ రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.

22 మే: పరిగి ఆర్టీఓ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆకుల ప్రవీణ్‌కుమార్‌, మరో ప్రైవేటు వ్యక్తి ఆదిల్‌ఖాన్‌ 10వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
 అవినీతికి పరాకాష్ట..! ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్న అదికారులు..!!

అవినీతికి పరాకాష్ట..! ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్న అదికారులు..!!

17 మే: షాద్‌నగర్‌ మునిసిపాలిటీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శేఖర్‌రెడ్డి 10వేల రూపాయల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. 13 మే: వేములవాడ దేవస్థానం చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ లక్ష్మణ్‌గౌడ్‌ను 6.5 లక్షల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 7మే: పెద్దమ్మగుడి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అంజనారెడ్డి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ చిక్కాడు. నెల రోజుల క్రితం 15వేల రూపాయలు లంచం తీసుకుంటున్న రాజేంద్రనగర్‌ కోర్టు పీపీ ప్రసన్నలక్ష్మిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

 ప్రజల్లో అవగాహన పెరగాలి..!డబ్బులు డిమాండ్‌ చేస్తే 1064కి ఫోన్‌ చేయాలంటున్న అదికారులు..!!

ప్రజల్లో అవగాహన పెరగాలి..!డబ్బులు డిమాండ్‌ చేస్తే 1064కి ఫోన్‌ చేయాలంటున్న అదికారులు..!!

ఇవి కొన్ని ఘటనలు మాత్రమే. ప్రతి శాఖలో ఉన్న లొసుగులను అవకాశంగా చేసుకుంటున్న కొంతమంది అవినీతి అధికారులు అమాయకులను దోచుకునేందుకు పథకం వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బయటి వ్యక్తులు కూడా వారికి సహకరించి అవినీతిలో భాగస్వాములు అవుతున్నారు. కిందిస్థాయి అధికారులు పోటీపడి అవినీతి సంపాదనపై దృష్టి సారిస్తున్నారు. అవినీతి జరిగితే సమాచారం అందిస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వాధికారులు ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు.

English summary
Some people have been corrupted despite the government's job and heavy pay. Money from the people who went to the offices for work is going to be burdened. Some people come forward and report to the ACB and are reported to be Red handed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X