వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో సూపర్ స్ప్రెడర్ల కలకలం... తూర్పుగోదావరి జిల్లాలో ఒకరితో 117 మందికి...

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కోసం విధించిన లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో పరిస్ధితులు తారుమారవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సూపర్ స్ప్రెడర్ల ద్వారా భారీగా కేసులు నమోదు కావడం ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో ఒకే ఒక్క వ్యక్తి ద్వారా 117 మందికి వైరస్ సోకడంతో ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం తలపట్టుకుంటోంది.

 కరోనా కాలంలో కొత్త స్టార్టప్ .. ఇక చావు తిప్పలకు చెక్ ..ఆన్ లైన్ ద్వారా అంత్యక్రియలు కరోనా కాలంలో కొత్త స్టార్టప్ .. ఇక చావు తిప్పలకు చెక్ ..ఆన్ లైన్ ద్వారా అంత్యక్రియలు

 ఏపీలో కరోనా సూపర్ స్ప్రెడర్లు....

ఏపీలో కరోనా సూపర్ స్ప్రెడర్లు....

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా క్షేత్రస్ధాయిలో పరిస్దితులు మాత్రం అందుకు సహకరించడం లేదు. ముఖ్యంగా లాక్ డౌన్ మినహాయింపుల నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో పలుచోట్ల భారీగా కరోనా వ్యాప్తి జరుగుతోంది. ముఖ్యంగా పలు జిల్లాల్లో సూపర్ స్ప్రెడర్ల సంఖ్యతో పాటు వారి నుంచి వైరస్ సోకిన బాథితుల సంఖ్య కూడా పెరుగుతోంది.

 తూర్పుగోదావరిలో....

తూర్పుగోదావరిలో....

రాష్ట్రంలో సూపర్ స్ప్పెడర్ల పరిస్ధితి ఎలా ఉందని చెప్పడానికి అతిపెద్ద ఉదాహరణగా తూర్పుగోదావరినే చెప్పవచ్చు, ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ఒకే ఒక్క వ్యక్తి కారణంగా 117 మందికి వైరస్ సోకినట్లు తాజాగా అధికారులు గుర్తించారు. జిల్లాలోని 5300 టుంబాలు, 21 వేల మంది జనాభా కలిగిన గొల్లల మామిడాడ గ్రామంలో ఓ హోటల్‌ కు అనధికారికంగా తెరవడంతో ఇందులో ఓ వ్యక్తి ద్వారా 117 మందికి వైరస్ సోకింది.

 గుంటూరు మార్కెట్ మరో కోయంబేడు....

గుంటూరు మార్కెట్ మరో కోయంబేడు....

నిన్న మొన్నటి వరకూ గుంటూరు నగరంలోనే ఉన్న హోల్ సేల్ కూరగాయల మార్కెట్ ను లాక్ డౌన్ నేపథ్యంలో శివార్లలోని ఏటుకూరు బైపాస్ వద్దకు మార్చారు. నగరంలోని హోల్ సేల్ వ్యాపారులతో పాటు రిటైల్ వ్యాపారులు, వినియోగదారులు ఇక్కడికి భారీ సంఖ్యలో వచ్చి కూరగాయలు కొనేవారు. తాజాగా ఇక్కడ 26 మంది వ్యాపారులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక్కడా ఎవరో ఒక సూపర్ స్ప్రెడర్ కారణంగానే వైరస్ వ్యాప్తి జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో మార్కెట్ మూసేశారు. తాజాగా ఇక్కడ బయటపడిన కేసులను చూస్తే కోయంబేడు మార్కెట్ పరిస్దితి వస్తుందా అన్న భయాలు నెలకొంటున్నాయి.

English summary
growth of coronavirus super spreaders in andhra pradesh becomes a big problem for state government after lockdown relaxations. east godavari alone records 117 cases with a super spreader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X