వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్కారుకు ఇష్టంలేదు: అగ్రిగోల్డ్‌ను టేకోవర్ చేయలేమంటూ హైకోర్టులో జీఎస్ఎల్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: అగ్రిగోల్డ్ టేకోవర్‌పై జీఎస్సెల్ సంస్థ మళ్లీ వెనక్కి తగ్గింది. అగ్రిగోల్డ్ ఆస్తులను తాము తీసుకోలేమంటూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ డీల్ నుంచి తప్పుకుంటామంటూ న్యాయస్థానానికి తెలిపింది.

రూ.10కోట్లు తిరిగిచ్చేలా..

రూ.10కోట్లు తిరిగిచ్చేలా..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నందున ఆస్తులను టేకోవర్ చేయలేమని కోర్టుకు వెల్లడించింది. జీఎస్ఎల్ సంస్థ తాము డిపాజిట్ చేసిన 10 కోట్ల రూపాయలను వడ్డీతో సహా చెల్లించేలా ఆదేశించాలని హైకోర్టుకు విన్నవించింది. ఈ కేసులో తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు.

అగ్రిగోల్డ్ ఆస్తులను రూ.4వేల కోట్లకు కొనుగోలు చేస్తాం కానీ: జీఎస్సెల్ గ్రూప్అగ్రిగోల్డ్ ఆస్తులను రూ.4వేల కోట్లకు కొనుగోలు చేస్తాం కానీ: జీఎస్సెల్ గ్రూప్

తాజా పరిస్థితుల నేపథ్యంలో..

తాజా పరిస్థితుల నేపథ్యంలో..

కాగా, ఎనిమిది రాష్ట్రాలు, 25 నుంచి 30 లక్షల మంది బాధితులు, దాదాపు రూ. 20 వేల కోట్లు... కొన్ని ఏళ్లుగా బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. ఇప్పటికే జీఎస్సెల్ సంస్థ వెనక్కి తగ్గి.. మళ్లీ ముందుకు వచ్చింది. అయితే తాజా పరిస్థితులతో చేతులెత్తేసిన జీఎస్సెల్ సంస్థ... తాము డిపాజిట్ చేసిన మొత్తాన్ని వెనక్కి విప్పించాలని విజ్ఞప్తి చేసింది.

 జీఎస్ఎల్ ప్రతిపాదన హేతుబద్దంగా లేదు: కుటుంబరావు

జీఎస్ఎల్ ప్రతిపాదన హేతుబద్దంగా లేదు: కుటుంబరావు

అగ్రిగోల్డ్ టేకోవర్ విషయంలో జీఎస్ఎల్ గ్రూప్ ప్రతిపాదన హేతుబద్దంగా లేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. ముందుగా అగ్రిగోల్డ్ ఆస్తులు తీసుకుని నెమ్మదిగి సొమ్ము చెల్లిస్తామని చెబుతోందని అన్నారు. ఆస్తులు తీసుకున్న నాలుగేళ్ల తర్వాత చెల్లిస్తామని చెబుతోందని తెలిపారు.

జీఎస్ఎల్ ప్రతిపాదనలు వ్యతిరేకంగా.. వేలం వేస్తాం

జీఎస్ఎల్ ప్రతిపాదనలు వ్యతిరేకంగా.. వేలం వేస్తాం

జీఎస్ఎల్ ప్రతిపాదనలను ఏపీ సర్కారు అంగీకరించడం లేదని కుటుంబరావు చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులు కూడా దీన్ని వ్యతిరేకించారని చెప్పారు. జీఎస్ఎల్ గ్రూప్‌పై అనేక అనుమానాలున్నాయని కోర్టులో పిటిషన్ కూడా వేశారని చెప్పారు. అయితే, కోర్టు అనుమతిస్తే జిల్లాలవారీగా కమిటీలు వేసి అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే వేలం వేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. కోర్టు పర్యవేక్షణలో వేలానికి సిద్దమని కుటుంబరావు తెలిపారు.

English summary
GSL Group backstep on to takeover Agrigold assets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X