వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్ఐ సూసైడ్.. ప్రియురాలు సురేఖ అరెస్ట్.. 306 సెక్షన్ కింద కేసు

|
Google Oneindia TeluguNews

కృష్ణా జిల్లా గుడివాడ టూటౌన్‌ ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో పురోగతి సాధించారు. విజయ్ కుమార్ ప్రియురాలు సురేఖను అరెస్ట్ చేశారు. విజయ్ ఆత్మహత్యకు సురేఖనే కారణమని విజయ్ తమ్ముడు విక్రమ్ ఫిర్యాదు చేశాడు. విచారణ అనంతరం సురేఖను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల తర్వాత సురేఖను మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరు పరచనున్నారు.

ఎస్ఐ ఆత్మహత్య..

ఎస్ఐ ఆత్మహత్య..

గుడివాడ టూ టౌన్‌ ఎస్‌ఐ పిల్లి విజయ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. విజయ్‌కుమార్ మృతికి వివాహేతర సంబంధమే కారణం అని సహచర సిబ్బంది అనుమానించగా.. అదే నిజమైపోయింది. విజయ్ కుమార్‌కు రెండు నెలల కిందట పెళ్లయ్యింది. ఇంతలోనే చనిపోయారు.

బ్యూటిషీయన్‌తో వివాహేతర సంబంధం

బ్యూటిషీయన్‌తో వివాహేతర సంబంధం

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన విజయ్ కుమార్ 2012 బ్యాచ్ ఎస్సై. హనుమాన్ జంక్షన్‌లో ఎస్సైగా తొలిసారి బాధ్యతలు స్వీకరించాడు. ఆయనకు నూజివీడుకు చెందిన బ్యూటీషియన్‌తో‌ వివాహేతర సంబంధం ఉంది. ఈ ఆరోపణలతో విజయ్ కుమార్ అప్పట్లో సస్పెండ్ కూడా అయ్యాడు. సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత తిరిగి విధుల్లో చేరాడు. గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా బాధ్యతలు నిర్వహించారు.

మారని ఎస్ఐ తీరు

మారని ఎస్ఐ తీరు

తర్వాత కూడా విజయ్ కుమార్ తీరు మారలేదు. పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నారు. ఏలూరుకు చెందిన మహిళతో మూడు నెలల కిందట పెళ్లి చేశారు. భార్యను కాపురానికి తీసుకురావడం లేదు. బ్యూటీషియన్‌తో కలిసి మాత్రం ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. భార్యను తీసుకురాలేగా, బ్యూటిషీయన్‌కు చెప్పలేక నలిగిపోయాడని తెలుస్తోంది. బ్యూటిషీయన్ ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆందోళన చెంది ఉంటాడు. అందువలే విజయ్ కుమార్ మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

Recommended Video

కొడాలి నాని పై నందమూరి ఫాన్స్ ఫైర్ || Ap Minister Made Sensational Comments On NTR Film Journey

English summary
gudivada 2 town si pilli vijay kumar lover surekha today arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X