• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎస్సై సూసైడ్.. ఇంట్లోనే ఆత్మహత్య, వివాహేతర సంబంధమే కారణమా..?

|

కృష్ణాజిల్లా గుడివాడలో విషాదం చోటుచేసుకుంది. టూ టౌన్‌ ఎస్‌ఐ పిల్లి విజయ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే విజయ్‌కుమార్ మృతికి వివాహేతర సంబంధమే కారణం అని సహచర సిబ్బంది అనుమానిస్తున్నారు. విజయ్ కుమార్‌కు రెండు నెలల కిందట పెళ్లయ్యింది. ఇంతలోనే చనిపోవడం కలకలం రేపింది.

    కృష్ణా: గుడివాడ టూటౌన్ ఎస్సై ఆత్మహత్య

    పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన విజయ్ కుమార్ 2012 బ్యాచ్ ఎస్సై. హనుమాన్ జంక్షన్‌లో ఎస్సైగా తొలిసారి బాధ్యతలు స్వీకరించాడు. ఆయనకు నూజివీడుకు చెందిన బ్యూటీషియన్‌తో‌ వివాహేతర సంబంధం ఉంది అనే వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణలతో విజయ్ కుమార్ అప్పట్లో సస్పెండ్ కూడా అయ్యాడు. సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత తిరిగి విధుల్లో చేరాడు. గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా బాధ్యతలు నిర్వహించారు.

    gudivada 2 town si vijay kumar suicide

    తర్వాత కూడా ఆయన తీరు మారలేదు. పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నారు. ఏలూరుకు చెందిన మహిళతో మూడు నెలల కిందట పెళ్లి చేశారు. భార్యను కాపురానికి తీసుకురావడం లేదు. బ్యూటీషియన్‌తో కలిసి మాత్రం ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. భార్యను తీసుకురాలేగా, బ్యూటిషీయన్‌కు చెప్పలేక నలిగిపోయాడని తెలుస్తోంది. బ్యూటిషీయన్ ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆందోళన చెంది ఉంటాడు. అందువలే విజయ్ కుమార్ మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

    విజయ్ కుమార్ మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ మరణవార్త తెలుసుకున్న సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది, ఏరియా ఆసుపత్రికి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఎస్సై ఆత్మహత్య మాత్రం కలకలం రేపింది.

    English summary
    gudivada 2 town si pilli vijay kumar suicide at home due to affair.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X