వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"భూదందాలో గంటా?.. ఆయన వెనుక లోకేష్ చంద్రబాబు.. సీబీఐ ఎందుకు వద్దు?"

ఇక ఈ కుంభకోణం వెనుక ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు ప్రధానంగా వినిపిస్తుందని, జనం కూడా అదే చర్చించుకుంటున్నారని అన్నారు.

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖ భూదందాలో టీడీపీ నేతల ప్రమేయం ఉందని వైసీపీ తొలి నుంచి ఆరోపిస్తోన్నసంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీ నేత అమరనాథ్ రెడ్డి మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. భూదందాల్లో ప్రమేయం ఉన్నవాళ్లకు రాజకీయ నాయకులతోను, అధికారులతోను సంబంధాలున్నట్లుగా మంత్రి అయ్యన్నపాత్రుడే చెప్పుకొచ్చారని, అలాంటప్పుడు అదే అధికారులు ఉండే కమిటీతో విచారణ ఎలా జరిపిస్తారని మండిపడ్డారు.

మనుషులా? పశువులా?: భూదందాపై కడిగేసిన అయ్యన్న!, కంగు తిన్న మంత్రులు..మనుషులా? పశువులా?: భూదందాపై కడిగేసిన అయ్యన్న!, కంగు తిన్న మంత్రులు..

భూకబ్జాలపై సిట్(స్పెషల్ ఇంటరాగేషన్ టీమ్)తో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. భూదందా వ్యవహారాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారుల పాత్ర ఉందని మంత్రి అయ్యన్నపాత్రుడే స్వయంగా వెల్లడించారన్నారు.ఇక ఈ కుంభకోణం వెనుక ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు ప్రధానంగా వినిపిస్తుందని, జనం కూడా అదే చర్చించుకుంటున్నారని అన్నారు.

gudivada amarnath demands cbi probe into vizag land scam

మంత్రి గంటా వెనుక చంద్రబాబు, లోకేశ్ ఉన్నారని ప్రజలు భావిస్తున్నట్లుగా అమరనాథ్ రెడ్డి చెప్పారు. విశాఖలో మొత్తం రూ.2లక్షల కోట్ల నుంచి రూ.3లక్షల కోట్ల భూమి కబ్జాకు గురైందన్నారు. భూములు రికార్డులు సైతం మాయమైన విషయాన్ని కలెక్టరే అంగీకరించారని తెలిపారు. ఇంత పెద్ద కుంభకోణంపై ఏదో నామమాత్రపు విచారణతో సరిపుచ్చుతారా? అని ప్రశ్నించారు.

అదే సమయంలో తెలంగాణలో టీడీపీ నేతల వ్యాఖ్యలను అమరనాథ్ రెడ్డి ప్రస్తావించారు. హైదారబాద్ లోని మియాపూర్ భూకుంభకోణంపై టీడీపీ నేతలు సీబీఐ విచారణకు పట్టుబడుతున్నారని, మరి ఇక్కడెందుకు సీబీఐ విచారణ జరపరని నిలదీశారు. భూకబ్జాలపై విచారణ జరిపేందుకు భయమెందుకని ప్రశ్నించారు.

అధికార ముసుగులో టీడీపీ నేతుల వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో భూములు కోల్పోయిన పేదల పక్షాన తాము న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.

English summary
YSR Congress leader Amaranth Reddy demanded CBI probe into Vizag land scam, the biggest of its kind in the State history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X