వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్నలిస్టులకు నివాస గృహాల నిర్మాణానికి ప్రభుత్వం సిద్దం:మంత్రి కాల్వ

|
Google Oneindia TeluguNews

అమరావతి:రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన జర్నలిస్టులకు త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్ల నిర్మాణం అంశంపై మంత్రి కాల్వ శ్రీనివాసులు నేతృత్వంలో సచివాలయంలో గురువారం కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గృహనిర్మాణ శాఖా మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ హౌసింగ్‌ స్కీమ్ ల ద్వారా జర్నలిస్టులకు నివాస గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

పట్టణ ప్రాంతాలలో 2.65 లక్షల యూనిట్‌ కింద ఇల్లు నిర్మించడానికి ఐ అండ్‌ పిఆర్‌ ద్వారా ఒక లక్ష సబ్సిడీ, మిగతా స్కీంలకు ఒక్కో దానికి 1.5 లక్షల సబ్సిడీ ఇవ్వనున్నట్లు మంత్రి కాల్వ ప్రకటించారు. మునిసిపల్‌, జిల్లా కేంద్రాలలో రూ. 11.5లక్షలతో నిర్మించే ఇళ్ళకు ప్రభుత్వ సబ్సిడీ మూడు లక్షలు, జర్నలిస్టులకు అదనంగా ప్రభుత్వ సబ్సిడీ మూడు లక్షలు, జర్నలిస్టులకు అదనంగా ఐ అండ్‌ పిఆర్‌ ద్వారా రూ. 1.5 లక్షల సబ్సిడీ ఇస్తామని ఆయన వెల్లడించారు.

Guidelines on Residential houses for journalists Minister Kalva

జర్నలిస్ట్ యూనియన్లతో కీలక సమావేశం అనంతరం మంత్రి కాల్వ శ్రీనివాసులు తమ ప్రతిపాదనలు వివరించారు. ఆ ప్రతిపాదనలు ఇవి.

1) మండల, జిల్లా కేంద్రాలలో స్థలాలు కొనుగోలు చేసి అయినా జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇస్తారు. ఆమేరకు కలెక్టర్లకు ఉత్తర్వులు వెంటనే ఇస్తారు.

2) స్థలం ఉన్నవారు కావాలంటే వెంటనే గృహం నిర్మించుకోవచ్చు.

3) స్థలాలు లో గృహాలు కట్టుకొనే వారు ఎక్కువ విస్తీర్ణం లో కూడా కట్టుకోవచ్చు. అయితే ప్రభత్వం ఇచ్చే సబ్సిడీ పెరగదు.

4) ఏపీయుడబ్ల్యూ జే సూచన మేరకు భార్య, తల్లిదండ్రులు పేరుతో స్థలం ఉన్న గృహం మంజూరు చేసే అంశం ను పరిశీలించేందుకు హామీ.

5) అలాగే ఏజెన్సీ ప్రాంత మండలాల వారికి సమీప మండలాలలో స్థలాలు, గృహాలకు హామీ.

6) సబ్సిడీ....

a) గ్రామీణ ప్రాంతాలలో అయితే ఉచిత గృహనిర్మాణం b) అర్బన్ లో 300 చ.అ అయితే రూ 1.5 కు మరో రూ లక్ష కలిపి రూ 2.5 లక్షలు సబ్సిడీ.

సి) 365 చ.అ లు అయితే యూనిట్ కాస్ట్ రూ 6.65 లక్షలు. సబ్సిడీ రూ 3 ప్లస్ రూ 1.5 లక్షలు. మొత్తం రూ 4.5 లక్షలు. జర్నలిస్టులు కట్టవలసింది రూ 2.15 లక్షలు. ( అదే బ్యాంక్ లోను)

d) డబుల్ బెడ్..430 చ.అ అయితే యూనిట్ కాస్ట్ రూ 7.65 లక్షలు. సబ్సిడీ రూ 4.50 లక్షలు. జర్నలిస్టులు కట్టవలిసింది. రూ 3.15 లక్షలు.

F) కేవలం జర్నలిస్టుల కోసం 3 బెడ్ రూమ్ గృహం. కేవలం మున్సిపాలిటీస్, జిల్లా కేంద్రాలలో మాత్రమే.G ప్లస్ 3 అపార్ట్మెంట్స్. 720 చ.అ. కావాల్సిన వారికి 1000 చ.అ లకు పెంచే విషయం పరిశీలన. యూనిట్ కాస్ట్ రూ 11.50 లక్షలు. సబ్సిడీ రూ 4.50 లక్షలు. జర్నలిస్టులు కట్టవలసింది. రూ 7 లక్షలు.

మంత్రి కాల్వ శ్రీనివాసులు తమ ప్రతిపాదనలు వెల్లడించిన అనంతరం జర్నలిస్టు సంఘాలైన ఎపిడబ్ల్యుజె, ఎపిజెఎఫ్ తమ యూనియన్ల తరుపున కొన్ని డిమాండ్లను మంత్రి కాల్వ ముందు ఉంచాయి. వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని ఈ సందర్భంగా మంత్రి కాల్వ శ్రీనివాసులు హామీ ఇచ్చారు.

English summary
The AP government on Thursday constituted a key meeting headed by minister for information and public relations and rural housing Kalva Srinivasulu to explain guidelines for allotment of three-bed room flats in apartments to the journalists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X