హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుర్రాడోయ్ కుర్రాడు: ముక్కుతో టైపింగ్ రికార్డు(పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని పాతబస్తీ కుర్రాడు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం పొందాడు. ఎనిమిదేళ్ల వయస్సు నుంచి తన కంటూ ప్రత్యేక స్థానాన్ని పొందాలనే సంకల్పంతో అతను సాధన మొదలెట్టాడు. బీటెక్ పూర్తి చేసిన మహ్మద్ ఖుర్షీద్ అనుకున్నది సాధించాడు. అతడి సంకల్పానికి తల్లిదండ్రులు చేయూతనందించారు. ముక్కుతో టైప్ చేసి గిన్నీస్‌లో రికార్డుల్లోకి ఎక్కాడు.

తన పేరిటే ఉన్న 54 సెకన్ల గిన్నీస్ వరల్డ్ రికార్డును తానే బద్దలుకొట్టారు. ప్రతి రోజు దాదాపు 8 గంటలు ప్రాక్టీస్ చేసేవాడినని చెప్పాడు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం కేవలం 54 సెకన్లలో 103 క్యారెక్టర్లను టైప్ చేసి వరల్డ్ రికార్డును సాధించానని తెలిపారు.

ముక్కుతో ప్రతిరోజు 8 గంటలు టైపింగ్ ప్రాక్టీస్ చేయడం మామూలు విషయం కాదని, ఎన్నో సమస్యలు వచ్చినా సాధనపైనే దృష్టి పెట్టినట్టు ఖుర్దీద్ తెలిపారు. పూర్తి స్థాయిలో టైప్‌రైటింగ్‌పై దృష్టి పెట్టేలని తన అమ్మానాన్నలు చెప్పారని అక్బర్ హుస్సేన్, హుస్సైనా నవాజ్‌లు కుమారుడైన ఖుర్షీద్ తెలిపారు.

ముక్కుతో టైప్ చేసి రికార్డు

ముక్కుతో టైప్ చేసి రికార్డు

హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం వివిధ రంగాల ప్రముఖులు, మీడియా ప్రతినిధుల ముందు ముక్కుతో టైప్ చేశాడు ఖుర్షీద్.

గతంలోనూ రికార్డు

గతంలోనూ రికార్డు

2012 ఫిబ్రవరి 2న ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్‌ను 3.43 సెకన్లలోనే టైప్ చేసి వరల్డ్ ఫాస్టెస్ట్ టైప్‌రైటర్‌గా గిన్నీస్‌లో స్థానం సంపాదించాడతను.

గడియారంతో పోటీ

గడియారంతో పోటీ

కేవలం 47 సెకన్ల వ్యవధిలో 103 క్యారెక్టర్స్‌ను ముక్కుతో టైప్ చేసి ఖుర్షీద్ గిన్నీస్ ప్రపంచ రికార్డును నెలకొల్పారు.

సాక్షులు వీరే..

సాక్షులు వీరే..

పద్మశ్రీ, ద్రోణాచార్య అవార్డు గ్రహీత అరీఫ్, మిస్టర్ వరల్డ్-2 విజేత మోతేశం అలీ, ద్వి పౌరసత్వం కలిగిన మొదటి ఇండియన్ ఇఫ్తికార్ షరీఫ్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ సాక్షులుగా వ్యవహరించారు.

ముందుకే ఇలా..

ముందుకే ఇలా..

ఒక్క గిన్నీస్ రికార్డుతోనే ఆగిపోవాలని అనుకోలేదని, కొత్తగా ఏదైనా చేయాలనే తపనతోనే ముక్కుతో టైప్ చేస్తే ఎలా ఉంటుంనే ఆలోచన వచ్చిందని, సాధన మొదలు పెట్టానని ఖుర్షీద్ తెలిపారు.

English summary
Guinness World Record Event of Typing with Nose at Somajiguda Press Club.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X