వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
congress raghuveera reddy rahul gandhi gujarat assembly election 2017 gujarat assembly election results 2017
బిజెపిది అనైతిక రాజకీయం...నైతిక విజయం కాంగ్రెస్‌దే: రఘువీరారెడ్డి
అనంతపురం: గుజరాత్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, కేవలం 9 సీట్ల తేడాతో మాత్రమే తమ పార్టీ అధికారానికి దూరమైందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.
బీజేపీ ప్రజల భావోద్వేగాలతో అనైతిక రాజకీయాలకు పాల్పడిందని రఘువీరారెడ్డి ఆరోపించారు. గుజరాత్ లో నైతిక విజయం తమ పార్టీదేనని, అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదని అన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను కీలక దశలో భుజానికెత్తుకున్నారని చెప్పారు.

రాబోయే కాలంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేగలిగే సత్తా రాహుల్ కు ఉందని ప్రశంసించారు. నేటి యువతకు రాహుల్ గాంధీ ఆదర్శమని, రాజకీయాలంటే ప్రజల కోసం పనిచేసే విధంగా ఉండాలని రాహుల్ ఎప్పుడూ చెబుతూ ఉంటారని రఘువీరారెడ్డి తెలిపారు.