వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గ్రేహౌండ్స్‌, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు:ఆర్కే ఉన్నాడా?

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం:ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గ్రేహౌండ్స్‌ దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పుల జరుగుతున్నట్లు తెలిసింది. బలిమెల రిజర్వాయర్ పరిధిలోని సిమిలిపొదర్ అటవీ ప్రాంతంలో ఉదయం నుంచి ఈ కాల్పుల పోరాటం కొనసాగుతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఈ కాల్పులు జరుగుతున్న ప్రాంతంలో మావోయిస్టు అగ్ర నేత ఆర్కే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాల్పులు,ఆర్కే గురించి పోలీసులను మీడియా ప్రశ్నించగా కాల్పులు జరుగుతున్న విషయం వాస్తవమేనని అంగీకరించారు.

Gun fire between Greyhounds and Maoists in Andhra-Odisha border: Is RK right there?

అయితే ఆ ప్రాంతంలో ఆర్కే ఉన్నాడా లేదా అనేది ఇప్పుడే ఏమీ చెప్పలేమని తెలపారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్న విషయాన్ని నిర్థారించారు. అయితే దండకారణ్యంలో మావోయిస్ట్ ల సమాచారం పోలీసులకు తెలియడంతో పెద్ద స్కెచ్ వేశారని, ఈ కాల్పుల్లో పోలీసులదే పైచేయి అవచ్చని స్థానికంగా ప్రచారం జరుగుతుంది.

English summary
Visakhapatnam: There is a fierce encounter between the Greyhounds troops and the Maoists on the Andhra-Odisha border. There is a information of Maoist Top Leader RK in the gunfiring area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X