గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాస్సేపట్లో వ్యాక్సినేషన్: వైఎస్ జగన్ షెడ్యూల్ ఇదే: వారంలో ఎన్ని రోజులు వ్యాక్సిన్?

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం మరి కొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ఆరంభం కాబోతోంది. అన్ని రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభమౌతుంది. దీనికోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు పూర్తి చేశాయి. ఆయా కేంద్రాలకు వ్యాక్సిన్ల సరఫరా పూర్తయింది. డిజిగ్నేటెడ్ పాయింట్లలో వ్యాక్సిన్లను భద్ర పరిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతోన్నారు.

సీ ఓటర్ సర్వే: అత్యంత ప్రజాదరణ గల ముఖ్యమంత్రుల జాబితా ఇదే: జగన్ ఏ స్థానంలో ఉన్నారంటే?సీ ఓటర్ సర్వే: అత్యంత ప్రజాదరణ గల ముఖ్యమంత్రుల జాబితా ఇదే: జగన్ ఏ స్థానంలో ఉన్నారంటే?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతోన్నారు. ఉదయం 11:30 నిమిషాలకు ఆయన విజయవాడ ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)లో వ్యాక్సినేషన్‌ను లాంఛనంగా ఆరంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానితో మాట్లాడతారు. రాష్ట్రంలో తొలిదశలో వ్యాక్సినేషన్ కోసం 3,87,983 మంది డాక్టర్లు, హెల్త్‌కేర్ వర్కర్లు వ్యాక్సిన్‌ను తీసుకోనున్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 332 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. ఇప్పటికే మూడుదశల్లో నిర్వహించిన డ్రైరన్‌కు అనుగుణంగా వ్యాక్సినేషన్ కొనసాగుతుంది.

Guntur: AP CM YS Jagan to launch vaccination drive from GGH at present

ఈ 332 కేంద్రాల్లో వందమందికి చొప్పున తొలిరోజు వ్యాక్సిన్ ఇస్తారు. ఈ ఒక్క రోజే 33,200 మంది హెల్త్‌కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ అందుతుంది. ఈ నెల 20వ తేదీ వరకు దీన్ని నిర్వహిస్తారు. వారంలో నాలుగురోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. సోమ, మంగళ, గురు, శనివారాల్లో మాత్రమే వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఇతరత్రా టీకాలను వేయడానికి ఆటంకం కలగకుండా ఉండేలా ఈ నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. 20వ తేదీ తరువాత మరికొన్ని సెషన్లు పెంచే అవకాశాలు ఉన్నాయి. తొలి విడతో వ్యాక్సిన్ తీసుకున్న వారికి 28 రోజుల తరువాత రెండో డోసును ఇస్తారు.

English summary
The COVID-19 vaccine will likely be rolled out within the presence of Chief Minister Y.S. Jagan Mohan Reddy on the Government General Hospital (GGH) in Vijayawada today. Total 332 vaccine session websites have been recognized within the State for the launch of the inoculation drive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X