అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరు కోర్టు సంచలన తీర్పు: ఇద్దరు కామాంధులకు 22 ఏళ్ల జైలు శిక్ష

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: మానసిక వికరాంగులాలిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఇద్దరు కామాంధులకు 22 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ గుంటూరు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసు పూర్వాపరాలను ఒక్కసారి పరిశీలిస్తే... గుంటూరులోని నల్ల చెరువుకు చెందిన దాసరి గౌరీశంకర్, షేక్ సుభానీ అనే వ్యక్తులు 2014న ఫిబ్రవరి 2వ తేదీన ఈ ఘటనకు పాల్పడ్డారు.

Guntur court sentences two rapists to 22 years

ఆరోజు 23 ఏళ్ల యువతి వారికి కంటపడింది. అనాథ యువతి అయిన ఆమెకు మతిస్థిమితం లేకపోడవమే కాకుండా మాటలు కూడా రావు. తనకు సరిగా కళ్లు కనిపించడం లేదని, గుంటూరలో వైద్యులకు చూపించుకునేందుకు వస్తున్నానని తనకు ఎదురుపడ్డ వారిద్దరికీ చెప్పంది.

దీంతో ఇదే అదనుగా భావించిన వారు ఆ యువతిని ఆసుపత్రిలో చేర్పిస్తామని చెప్పారు. దీంతో యువతి సంతోషించింది. ఈ నేపథ్యంలో గౌరీశంకర్ యువతిని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత గౌరీశంకర్, షేక్ సుభానీలు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ విషయం తెలిసిన స్థానికులు వాళ్లిద్దరిని చితకబాది పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ కేసును జిల్లా న్యాయమూర్తి ఎస్ఎం రఫీ సోమవారం విచారణ చేశారు. ఈ కేసులో నిందితులైన గౌరీ శంకర్, షేక్ సుభానీలను దోషులుగా తేల్చుతూ ఆయన తీర్పు చెప్పారు.

మానసిక వికరాంగులాలిపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు దోషులకు 22 ఏళ్ల జైలు శిక్ష, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పుని వెలువరించారు.

English summary
Guntur court sentences two rapists to 22 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X