గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరు:చిన్నారులపై కాక్సికా వైరస్ దాడి..5 నెలల్లో 56 మందిపై ఎటాక్

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

గుంటూరు:ఇటీవలే కలరా బారిన పడి కుదేలైన గుంటూరు నగరంలో తాజాగా కాక్సికా వైరస్ వణుకు పుట్టిస్తోంది. అయితే ఇది చిన్నారులపై దాడి చేసే వైరస్ కావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది.

గుంటూరు జిల్లాలో 5 నెలల వ్యవధిలో 56 మంది చిన్నారులు ఈ వైరస్‌ బారిన పడినట్లు వైద్య వర్గాలు వెల్లడించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రధానంగా ఏడేళ్ల లోపు చిన్నారులపై మీదే ప్రతాపం చూపించే ఈ వైరస్ కారణంగా చేతులు, కాళ్లు, ముఖంపై తీవ్ర దద్దుర్లు లేదా బొబ్బలు కనిపిస్తాయి. తట్టు లాగా కనిపించే ఈ వైరస్‌ ధాటికి చిన్నారులు అల్లాడిపోతారని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రాణాప్రాయ పరిస్థితి ఉండకపోవటమే ఈ వైరస్ కు సంబంధించి ఒక ఊరట.

Guntur:Coxica virus attack on children...

ఈ కాక్సికా వైరస్‌ను తొలిసారి 61 ఏళ్ల కిందట 1957లో న్యూజిలాండ్‌లో గుర్తించారు. కెనడా దీన్ని 1958లో సీవీఏ 16 వైరస్‌గా గుర్తించింది. ప్రస్తుతం అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాల్లో బాగా విస్తరించింది. భారత్‌లో తొలిసారిగా 2006లో నాగ్‌పూర్‌లో 4 కేసులు నమోదైనట్లు గుర్తించారు.
మన రాష్ట్రంలో కాక్సికా వైరస్‌ ను తొలిసారి గుంటూరు జిల్లాలోనే గుర్తించారు. 2017 అక్టోబర్‌లో ఈ ఒక్కజిల్లాలోనే 20 కేసులు నమోదైనట్లు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యవర్గాలు వెల్లడించాయి.

2016 ఏప్రిల్‌ వరకూ 56 మంది చిన్నారులకు ఈ వ్యాధి సోకినట్టు వెల్లడైంది. ఈ 5 నెలల్లోనే 56 మంది చిన్నారులు పడటం తల్లిదండ్రులతో పాటు వైద్య వర్గాల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ బారిన పడితే కనీసం ఏడు రోజులు అవస్థ పడతారని, సకాలంలో చికిత్స తీసుకుంటే తీవ్రత నిరోధించవచ్చని వైద్యులు చెబుతున్నారు. గుంటూరులోనే ఈ వ్యాధి బాధితులు ఉన్నారనడం కంటే ఇక్కడ ఈ వైరస్‌ను గుర్తించడం జరిగిందని, మిగిలిన చోట్ల ఉన్నా అది ఈ వైరస్ అని గుర్తించలేకపోయి ఉండొచ్చని ఇక్కడి వైద్యాధికారులు చెబుతున్నారు. వైరస్‌ సోకిన వారికి చికిత్స చేసి పంపించామని తెలిపారు.

ఈ వ్యాధి లక్షణాలు...చేతులు, కాళ్లు, ముఖం, నడుము భాగంలో ఎర్రటి దద్దుర్లు లేదా బొబ్బలు కనిపిస్తాయి...కాక్సికా వైరస్‌ లో మొత్తం 6 రకాలున్నట్లుగా వైద్య వర్గాలు చెబుతున్నాయి. హెచ్‌ఎఫ్‌ఎండీ (హ్యాండ్‌ ఫుట్‌ మౌత్‌ డిసీజ్‌) అని కూడా దీన్ని వ్యవహరిస్తారు. అక్టోబర్, నవంబర్‌ నెలల్లో వైరస్‌ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఒకరి నుంచి మరొకరికి నోటి ద్వారా, తుమ్ముల ద్వారా వ్యాపిస్తుంది...జ్వరం, గొంతు నొప్పితో ఇబ్బంది పడతారు...కీళ్ల నొప్పుల్లా ఉండి నీరసంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది...నెలల చిన్నారులు ఆహారం తినేందుకు చాలా అవస్థ పడతారు.

కాక్సికా వైరస్ అంటువ్యాధి...ఈ వ్యాధి నిర్థారణ, నివారణాకు తీసుకోవాల్సిన చర్యలు...వైరస్‌ సెల్‌ కల్చర్‌ అంటే రక్తపరీక్షల ద్వారా వ్యాధి లక్షణాలను నిర్థారించవచ్చు. వ్యాధి సోకిన చిన్నారులను స్కూళ్లకు పంపరాదు...వ్యాధి లక్షణాలు కనిపించగానే ప్రత్యేక గదిలోఉంచాలి.వ్యాధి సోకిన చిన్నారుల చేతులు, కాళ్లను పరిశుభ్రంగా ఉంచాలి. చిన్నారులకు వాడే ఉపకరణాలను సైతం ప్రత్యేకంగా ఉంచాలి. సాధారణంగా జ్వరానికి వాడే చికిత్సా విధానాలే దీనికి పాటిస్తారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా మందులు తీసుకుంటే సరిపోతుంది. వారంలో చికిత్స ద్వారా నయమవుతుంది.

English summary
The coxica virus is attacking on children in Guntur. Within 5 months, 56 people were infected by this disease.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X