• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కండోమ్ లు కూడా నకిలీవేనంట: గుంటూరు జిల్లాలో మరో విచిత్రం

|

గుంటూరు: కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ కాదేదీ కవితకు అనర్హం అన్నాడు శ్రీశ్రీ...ఈ మహా కవి మాటలను కల్తీలకు ఆపాదించుకొన్నారో ఏమో అన్నట్టుగా రెచ్చిపోతున్నారు గుటూరు జిల్లా కల్తీ రాయుళ్లు. తాజాగా ఇక్కడ వెలుగు చూసిన మరో నకిలీ వ్యవహారం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. ఇటీవలి కాలంలో ఏ పదార్ధాన్నయినా కల్తీ చేస్తూ...ఏ వస్తువుకైనా నకిలీ తయారుచేస్తున్న గుంటూరు జిల్లా కల్తీరాయుళ్లు ఇప్పుడు తమ డూప్లికేట్ ప్రొడక్ట్ ల జాబితాలో కండోమ్ ను కూడా చేర్చారట. అందువల్ల జిల్లాలో పలుచోట్ల నకిలీ కండోమ్ ల తయారీ కుటీర పరిశ్రమలుగా వర్థిల్లుతుందట. గుంటూరు ఆటోనగర్, నర్సరావుపేట లో శ్రీరామ్ నగర్, కోట సెంటర్లు ఈ మినీ ఇండస్ట్రీలకు అడ్డాలుగా ఉన్నాయని తెలుస్తోంది. బ్రాండెడ్ కండోమ్ ల ధర భారీగా ఉండటంతో వాటి పేరుతో సాగిస్తున్న ఈ డూప్లికేట్ కండోమ్ ల దందా వల్ల బాగా గిట్టుబాటు అవుతోందట. దీంతో కుటుంబాలకు కుటుంబాలు ఈ నకిలీ కండోమ్ ల తయారీ చేపట్టినట్లు తెలిసింది.

దందా సాగించేది ఇలా...

దందా సాగించేది ఇలా...

ఈ నకిలీ కండోమ్ ల అమ్మకాల తంతు రెండు రకాలుగా సాగుతోందట...వివిధ బ్రాండెడ్ కంపెనీల కండోమ్ బాక్స్ ల పై సీల్ తీసేసి అందులో నకిలీ కండోమ్ లు పెట్టి అమ్మేయడం ఒక పద్దతి..దీనివల్ల 10 రూపాయల విలువ కూడా చెయ్యని చవక రబ్బర్ తొడుగులను రూ.200లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారట. అయితే మెషీన్ల లో తయారవడం వల్ల చూడటానికి పైకి రెండు ఒక్కలాగే కనిపించడం,ఎంతో పరీక్షగా చూస్తేగాని నకిలీని గుర్తించలేమట. మరికొందరు తయారీదారులైతే మరో అడుగు ముందుకు వేసి రెచ్చగొట్టే బొమ్మలతో కూడిన బాక్స్ లను తయారు చేయించి మరీ ఈ కండోమ్ ల అమ్మకాలు సాగిస్తున్నారట. అయితే ఈ కండోమ్ ల కొనుగోళ్లు గుట్టుగా సాగే వ్యవహారం లా ఉండటమే ఈ నకిలీ రాయుళ్లకు వరంగా మారిందట. బ్రాండెడ్ కండోమ్ బాక్స్ లోని సింగిల్ పీస్ ప్యాక్ మీద కూడా తయారీ,ఎక్సపైరీ తేదీలుంటాయి. వీటి మీద ఉండవు, ఒకవేళ ఉన్నా కనిపెట్టే విధంగా ఉంటాయి. కానీ వినియోగదారులు కండోమ్ ప్యాకెట్లను కొన్నదే తడవుగా జేబులో వేసుకొని వెళ్లిపోతుండటం డబ్బు ఖర్చు అటుంచి ఏకంగా వారి ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తోందట. గుంటూరు జిల్లాలో ఎయిడ్స్ విజృంభణ ఎక్కువగా ఉండటానికి ఈ నకిలీ కండోమ్ లు కూడా ఒక కారణమని భావిస్తున్నారు.

రెండో రకం దందా....

రెండో రకం దందా....

ఇక రెండో రకం దందా విషయానికొస్తే గడువు తీరిపోయిన కండోమ్ లను పెద్ద ఎత్తున సేకరించి కెమికల్స్ సహాయంతో వాటి మీద గడువు తేదీలను చెరిపివేసి కొత్త తేదీలతో కండోమ్ ప్యాకెట్లను అమ్మేయడం..ఇందుకోసమే ఏకంగా కేరళ నుంచి ప్రత్యేకంగా రసాయనాలు తెప్పిస్తున్నారట. ఈ కండోమ్ ప్యాకెట్లపై కెమికల్ వాడకం వల్ల వీటిని వినియోగించేటప్పుడు తేలికగా చిరిగిపోతాయని, తద్వారా ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు అనేక సుఖ రోగాల బారిన పటడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

నిబంధనలు బేఖాతరు...

నిబంధనలు బేఖాతరు...

నిజానికి కండోమ్ లను తయారు చేసే సంస్థలు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సూచించే నిబంధనలు పాటించాలి. అయితే ఈ నకిలీలు ఇవేమి పాటించరు. వారే మార్కెట్ చేసుకుంటారు, ఈ క్రమంలో ఎన్నో అడ్డదార్లు తొక్కుతారు. కండోమ్ ల వినియోగం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటిని అమ్మకానికి ఉంచుతూ, విక్రయదారులకు పెద్ద మొత్తంలో కమీషన్లు ఆశ చూపుతూ ఈ నకిలీ కండోమ్ ల దందాను సాగిస్తున్నారు. కమీషన్ వస్తుందంటే విషాన్నయినా ఔషదమని చెప్పి అమ్మేసే దుకాణాదారులు మెండుగా ఉండటంతో ఈ డూప్లికేట్ కండోమ్ ల వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయల్లా యధేచ్చగా సాగిపోతోంది.

అధికారులు ఎప్పుడూ అదే పాట...

అధికారులు ఎప్పుడూ అదే పాట...

నకిలీ కండోమ్ ల దందా గురించి అధికారులను ప్రశ్నిస్తే ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చెయ్యలేదని, ఫిర్యాదు చేసినప్పడు చూద్దామని అంటున్నారు. అంతగా అయితే తాము ఇప్పడు నకిలీ మందులను ఏరేసే పనిలో ఉన్నామని ఆ పని పూర్తి చేశాక వీటిపై దృష్టి పెడతామని చెబుతున్నారు. అయితే నకిలీ కండోమ్ లను వినియోగదారులు గుర్తించినా ఆ విషయం ఫిర్యాదు చేయడాన్నినామోషీగా భావిస్తుండటం వల్ల నకిలీ కండోమ్ తయారీదారులకు అభయహస్తంలా మారిందనేది వినియోగదారుల సంఘం నేతల విశ్లేషణ.

English summary
Guntur district turns hub for product adulteration
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X