• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జనసేనతో చంద్రబాబు వన్‌సైడ్ లవ్: ఛాయిస్ పవన్ కల్యాణ్‌దే: ఎల్లుండి కీలక భేటీ

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన డిబేట్స్‌కు దారి తీశాయి. అటు తెలుగుదేశం, ఇటు జనసేన పార్టీ క్యాడర్‌లో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు కోసం తాము సంసిద్ధంగా ఉన్నామని, పవన్ కల్యాణ్‌తో కలిసి పని చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ చంద్రబాబు సందేశం పంపించారు.

పవన్‌ను కలుపుకెళ్లడంపై..

పవన్‌ను కలుపుకెళ్లడంపై..

పవన్ కల్యాణ్‌తో వన్ సైడ్ లవ్ ట్రాక్ నడుస్తోందంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. తమతో కలిసి పని చేయడానికి ఆయన కూడా అంగీకరించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తోన్న చంద్రబాబు- రామకుప్పం మండలం వీర్నమల తండాలో బహిరంగ సభలో ప్రసంగించే సమయంలో ఓ కార్యకర్త..అడిగిన ప్రశ్నకు టీడీపీ అధినేత ఈ లవ్ ట్రాక్‌ను వినిపించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కూడా కలుపుకుపోవాలని చంద్రబాబును కోరగా.. దీనిపై స్పందించారాయన.

వన్‌సైడ్ లవ్ ట్రాక్..

వన్‌సైడ్ లవ్ ట్రాక్..

లవ్‌ ఎప్పుడూ రెండు వైపులా ఉండాలని చంద్రబాబు చెప్పారు. వన్ సైడ్ లవ్‌ చేయడం కరెక్ట్‌ కాదని స్పష్టం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్‌తో కలిసి చేయడంపై చంద్రబాబు ఓ క్లారిటీ ఇచ్చినట్టయింది. 2014 నాటి సార్వత్రిక ఎన్నికలో పవన్ కల్యాణ్.. చంద్రబాబు వెంటే నిలిచిన విషయం తెలిసిందే. తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ కూటమికి చంద్రబాబు సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు.

2019లో వేర్వేరుగా..

2019లో వేర్వేరుగా..

అప్పటికే ఆయన జనసేన పార్టీ నెలకొల్పినప్పటికీ- ఎన్నికలకు దూరంగా ఉన్నారు. టీడీపీ-బీజేపీ కూటమికి అండగా నిలిచారు. 2019 ఎన్నికల నాటికి- జనసేన పూర్తిస్థాయి క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. దీనితో టీడీపీ-బీజేపీలతో పొత్తు ప్రసక్తే పెట్టుకోలేదు. మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్‌వాది పార్టీ, వామపక్షాలతో కలిసి ఎన్నికలను ఎదుర్కొంది.. చేదు ఫలితాలను చవి చూసింది. జనసేన ఒకేఒక్క స్థానానికి పరిమితమైంది. పవన్ కల్యాణ్ సైతం రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు.

పొత్తు వ్యవహారం మళ్లీ

పొత్తు వ్యవహారం మళ్లీ


ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం-జనసేన పార్టీ మధ్య పొత్తు వ్యవహారం తెరమీదికి వచ్చింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కార్యకర్తలు స్వయంగా ఈ విషయాన్ని ప్రతిపాదించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. తాము మాత్రమే కలిసి పని చేయడానికి సిద్ధపడితే ఉపయోగం ఉండబోదని, పవన్ కల్యాణ్ నుంచి కూడా తగిన స్పందన రావాల్సి ఉందనీ చెప్పుకొచ్చారు.

ఛాయిస్ పవన్ కల్యాణ్‌దే..

ఛాయిస్ పవన్ కల్యాణ్‌దే..


దీనితో పొత్తుల బంతి పవన్ కల్యాణ్ కోర్టులో పడినట్టయింది. ప్రస్తుతం జనసేన పార్టీ- బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యర్థులుగా బరిలో దిగినా.. ఆ తరువాత పరిణామాలు మారిపోయాయి. పవన్ కల్యాణ్.. బీజేపీ వైపు మొగ్గు చూపారు. తిరుపతి లోక్‌సభ, బద్వేలు శాసనసభ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో ఉమ్మడిగా కలిసి పోటీ చేశాయి. తెలంగాణలోనూ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోన్నాయి.

 బీజేపీతో తెగదెంపులా.. లేక

బీజేపీతో తెగదెంపులా.. లేక


టీడీపీతో కలిసి పని చేయాలంటే.. బీజేపీతో తెగదెంపులు చేసుకుంటుందా లేక.. వెనక్కి తగ్గుతుందా?.. లేక బీజేపీకి సైతం తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉన్న నేపథ్యంలో 2024 ఎన్నికల నాటికి ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడతాయాణ అనేది తేలాల్సి ఉంది. ఈ పరిస్థితుల మధ్య జనసేన పార్టీ కార్యనిర్వాహక విభాగం ఎల్లుండి భేటీ కానుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు కానుంది.

జనసేన భేటీకి ప్రాధాన్యత..

జనసేన భేటీకి ప్రాధాన్యత..


పవన్ కల్యాణ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సహా పలువురు సీనియర్ నాయకులు ఇందులో పాల్గొంటారు. నిజానికి- చంద్రబాబు వన్ సైడ్ ట్రాక్ వ్యాఖ్యలు చేయడానికి ముందే- జనసేన పార్టీ ఈ భేటీని షెడ్యూల్ చేసింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, రైతు సమస్యలు, జిల్లాల్లో పార్టీ బలోపేతం వంటి అంశాలను చర్చించాలని అజెండాగా పెట్టుకుంది. అదే సమయంలో చంద్రబాబు పొత్తు వ్యాఖ్యలు చేయడంతో ఈ సమావేశం ప్రాధాన్యత మారినట్లు చెబుతున్నారు.

English summary
Jana Sena Party executive committee will meet on January 9 at Party central office at Mangalagiri in Guntur district. Party Chief Pawan Kalyan will chair the meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X