వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుంటూరులో హోంమంత్రి అనుచరుడి హంగామా- పోలీసులపై బూతులు- ఎస్పీ చర్యలు..

|
Google Oneindia TeluguNews

గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్లోకి ఓ వ్యక్తి చొచ్చుకొచ్చాడు. తనను కొట్టిన వారిని ఎందుకు అరెస్ట్ చేయరంటూ ప్రశ్నించాడు. పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. హోంమంత్రికి ఫోన్ చేయమంటారా అని బెదిరించాడు. చివరికి అర్ధనగ్నంగా అక్కడే కూర్చుని పోలీసులను బూతులు తిట్టాడు. ఈ వ్యవహారం బయటికి రావడంతో హోంమంత్రి అనుచరుడిగా చెబుతున్న కాటమరాజును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు... అసలేం జరిగిందంటే...

 నల్లపాడు పీఎస్ లో హంగామా...

నల్లపాడు పీఎస్ లో హంగామా...

హోంమంత్రి సుచరిత అనుచరుడిగా చెప్పుకుంటున్న కాటమరాజు అనే వ్యక్తి గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్లో కొద్ది రోజులుగా తిరుగుతూ హల్ చల్ చేస్తున్నాడు. పైరవీల కోసం తిరుగుతున్న సదరు వ్యక్తి పీఎస్ లో పోలీసులకు కొంత మొత్తం ముట్టచెప్పాడు. అయినా తాను అనుకున్న పని జరగకపోవడంతో చెలరేగిపోయాడు. హోంమంత్రి అనుచరుడినైన తన దగ్గర డబ్బులు తీసుకుంటూ చెప్పినట్లు వినరా అంటూ రెచ్చిపోయాడు. పోలీసులపై బూతు పురాణం అందుకున్నాడు.

 అర్ధనగ్నంగా పోలీసులపైకి....

అర్ధనగ్నంగా పోలీసులపైకి....

తాజాగా జరిగిన ఓ ఘటనలో తనను కొట్టిన వారిని ఎందుకు అరెస్టు చేయరంటూ పోలీసులపై రెచ్చిపోయిన కాటమరాజు... ఈ క్రమంలో బట్టలూడదీసుకుని మరీ పోలీసులపైకి వెళ్లాడు. తన దగ్గర స్టేషన్లో ఎవరెంత తీసుకున్నారో లెక్కలు కూడా చెప్పాడు. దాదాపు గంటసేపు పోలీసులను బూతులు తిడుతూ విచ్చలవిడిగా ప్రవర్తించాడు. చివరికి పోలీసులు ఎలాగోలా సర్దిచెప్పి ఆయన్ను ఇంటికి పంపారు. ఈ వ్యవహారం కాస్తా జిల్లా ఎస్పీ వద్దకు చేరింది.

 ఎస్పీ ఆగ్రహం.. పోలీసులపైనా చర్యలు..

ఎస్పీ ఆగ్రహం.. పోలీసులపైనా చర్యలు..

హోంమంత్రి అనుచరుడిగా చెబుతున్న డొక్కు కాటమరాజు నగరాలు అనే వ్యక్తి అదికార వైసీపీకి చెందిన స్ధానిక నేతగా గుర్తించిన పోలీసులు... ఎస్పీకి సమాచారం ఇచ్చారు. దీంతో డీఎస్పీ కమలాకర్ ను నల్లపాడు పీఎస్ కు పంపి విచారణ జరిపించారు. డీఎస్పీ నివేదిక మేరకు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయడమే కాకుండా సీఐకి ఛార్జి మెమో ఇచ్చారు. గత కొన్నిరోజులుగా కాటమరాజు చేస్తున్న పైరవీలు, లావాదేవీల వివరాలు తెలుసుకుని అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. జిల్లాలో హోంమంత్రి పేరులో తాజాగా అకృత్యాలు పెరిగిపోతుండటంపై ఆగ్రహంగా ఉన్న ఎస్పీ... ఎంతటి వారైనా వదిలిపెట్టబోమనే సంకేతాలు ఇచ్చేందుకే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.

English summary
guntur district police has arrested a close aide of state home minister mekathoti sucharita for abusing officials while on duty. police arrested katamaraju for abusing nallapadu police station officials for not arrested some one who beat him earlier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X