గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫిరంగిపురం రైల్వే స్టేషన్...త్వరలో ఎపిలోనే తొలి మహిళా స్టేషన్...

|
Google Oneindia TeluguNews

గుంటూరు జిల్లా:అది గుంటూరు జిల్లాలో ఒక రైల్వే స్టేషన్...ఈ స్టేషన్ కు ఒక స్పెషాలిటీ సొంతం చేసుకోనుంది. అదేమిటంటే...ఇది త్వరలోనే లేడీస్ స్పెషల్ రైల్వే స్టేషన్ గా అవతరించబోతోంది...అంటే దీనర్థం...ఈ స్టేషన్ మహిళా ప్రయాణికుల కోసమే కేటాయిస్తారని కాదు అర్ధం...ఈ స్టేషన్ నిర్వహణ అంతా మహిళలే చూస్తారని...స్టేషన్ మాస్టర్ నుంచి సిగ్నలింగ్ సిబ్బంది వరకు...టికెట్లు ఇవ్వడం నుంచి...తనిఖీ సిబ్బంది వరకు అందరూ మహిళలే ఈ స్టేషన్ ను నిర్వహించనుండటం విశేషం.

ఇలా స్టేషన్ నిర్వహణ అంతా మహిళలే చూస్తున్న లేడిస్ స్పెషల్ రైల్వేస్టేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఇదే మొదటిది కానుండటం గమనార్హం. అంతేకాదు దేశం మొత్తంలో కూడా ఇలా మహిళల చేతే నిర్వహింపబడుతున్న స్టేషన్లు మరో రెండు మాత్రమే ఉన్నాయి. ఇలా ఎపిలోనే మొదటి మహిళా రైల్వేస్టేషన్ గుంటూరు జిల్లాలో ఏర్పాటు కాబోతుండటం వెనుక గుంటూరు డివిజినల్ రైల్వే మేనేజర్ వి.జి. భూమ కృషి ఉంది. ఈ రైల్వే స్టేషన్ మహిళా సాధికారతకు నిదర్శనమని ఆమె అంటున్నారు.

 ఈ లేడీస్ స్పెషల్ రైల్వే స్టేషన్...ఎక్కడంటే?...

ఈ లేడీస్ స్పెషల్ రైల్వే స్టేషన్...ఎక్కడంటే?...

గుంటూరు-నర్సరావుపేట రూట్ లో గుంటూరుకు 21 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఫిరంగిపురం రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుంచి ఇటు గుంటూరు కు లేదా అటు నర్సరావుపేటకు రాకపోకలు సాగించేందుకు సుమారు అర్థగంట సమయం పడుతుంది. జాతీయ రహదారికి ఈ రైల్వే స్టేషన్ 10 కి.మీ.కి దూరంలో ఉంటుంది.

 రాష్ట్రంలో మొదటిది...దేశంలో మూడవది...

రాష్ట్రంలో మొదటిది...దేశంలో మూడవది...

ముంబై నగరం పరిధిలోని మాతుంగా రైల్వే స్టేషన్ దేశంలోనే తొలి లేడిస్ స్పెషల్ స్టేషన్ కాగా ఇందుకు గాను ఆ రైల్వే స్టేషన్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కింది. ఆ తరువాత జైపూర్ గాంధీనగర్ రైల్వే స్టేషన్ దేశంలో రెండో మహిళా స్టేషన్..అలాగే మహిళా నిర్వహణ లోని మేజర్ రైల్వే స్టేషన్ కేటగిరిలో అయితే దేశంలోనే ఇదే మొదటిది. ఇక ఫిరంగిపురం రైల్వే స్టేషన్ విషయానికొస్తే ఇలా మహిళా రైల్వే స్టేషన్ గా అవతరించేందుకు అవసరమైన అన్ని అనుమతులు వచ్చేసినట్లుగా తెలుస్తోంది. మార్చి 8 న మహిళా దినోత్సవం రోజున ఈ స్టేషన్ ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇది దేశంలో మూడో లేడీస్ స్పెషల్ రైల్వే స్టేషన్ కాగా...ఎపిలో...దక్షిణ భారతదేశంలోనే మొదటిది.

డిఆర్ఎం సందేశం...ప్రత్యేక చర్యలు

డిఆర్ఎం సందేశం...ప్రత్యేక చర్యలు

విభిన్న రంగాల్లో మహిళా సాధికారతకు ఈ మహిళా రైల్వే స్టేషన్ నిదర్శనం అవుతుందని ఈ లేడీస్ స్పెషల్ రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కృషిచేసిన గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ వి.జి.భూమ చెప్పారు. అలాగే స్త్రీ,పురుష వివక్ష ను రూపుమాపడంలో ఒక పెద్ద ముందడుగు అన్నారు. ఈ స్టేషన్ కు సంబంధించి అన్ని విభాగాలను మహిళలకు అప్పగించడం అంటే వాటన్నింటినీ మహిళలు సైతం సమర్థవంతంగా నిర్వహించగలరని చాటి చెప్పడమేనన్నారు. అంతేకాదు తన డివిజన్ పరిధిలో డిఆర్ఎం భూమ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు అభినందనలు అందుకుంటున్నాయి. మహిళల ప్రత్యేక అవసరతలను దృష్టిలో ఉంచుకొని ఆమె గుంటూరు రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫామ్ నంబర్ 1 మీద శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్ ప్రారంభించారు. మహిళలు 5 రూపాయల నాణెం వేసి ఈ నాప్కిన్ పొందవచ్చు. ఈ మెషీన్లు అన్ని స్టేషన్లలో అందుబాటులోకి రావాలని, తేవాలనేదే తన ఆకాంక్షని ఈ సందర్భంగా డిఆర్ఎం భూమ చెప్పారు.

 డిఆర్ఎం భూమ...మరి కొన్ని ప్రత్యేక చర్యలు...

డిఆర్ఎం భూమ...మరి కొన్ని ప్రత్యేక చర్యలు...

మహిళల భద్రత, సిబ్బంది భధ్రతకు తాను అధిక ప్రాధాన్యత ఇస్తానని డిఆర్ఎం భూమ తెలిపారు. అలాగే అభివృద్ది పరంగానూ గుంటూరు డివిజన్ పరిధిలో అతి కీలకమైన నడికుడి-కాళహస్తి రైల్వే లైన్,గుంటూరు-బీబీనగర్, గుంటూరు-నంద్యాల విద్యుదీకరణ పనులు ఈమె హయాంలోనే జరుగుతుండటం గమనార్హం. అలాగే ప్రయాణికులకు సౌకర్యాలు అందే విషయంలోనూ సమయంతో నిమిత్తం లేకుండా ఆమె చేసే నిర్విరామ కృషి, సదుపాయాల లభ్యతకు సంబంధించి ఆమె చేసే ఆకస్మిత తనిఖీలు డిఆర్ఎం వి.జి. భూమకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి.

English summary
Guntur: An all-women railway station being launched at Phirangipuram may be on women's day will be a big step in addressing gender equality in the biggest public sector organisation in the country.This is first all-women station in Andhra Pradesh is in Phirangipuram on Guntur railway division. An all-women railway station launched at Phirangipuram will be a big step in addressing gender equality in the biggest public sector organisation in the country. The railway station on the Guntur-Narsaraopet line would be handed over to an all-women Staff...from the station master to the signalling staff to the ticket checking employees. Only the third-of-its-kind railway station in the country after Jaipur’s Gandhi Nagar and Mumbai’s Matunga, the all-women station is set to create history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X