వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ నేతలు బెదిరించారు: జీవీఎల్ సభా హక్కుల నోటీసు, షాకిచ్చిన టీడీపీ అభిమాని!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ నేతలపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు సోమవారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో తన ప్రసంగం తర్వాత టీడీపీ నేతలు తనను బెదిరించారని నోటీసులు ఇచ్చారు.

ఖబడ్దార్ అంటూ తీవ్ర పరిణామాలు ఉంటాయని టీడీపీ నేతలు హెచ్చరికలు చేశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వీడియో, ప్రింట్ మీడియా క్లిప్పింగ్స్‌ను రాజ్యసభ కార్యదర్శికి సమర్పించారు. టీడీపీ వైఫల్యాలను ఎండగట్టడంతోనే బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

GVL breach of privilege against Telugudesam

ఈ మేరకు జీవీఎల్ నర్సింహా రావు ట్వీట్ చేశారు. తనను బెదిరింపులకు గురి చేసినందుకు రాజ్యసభ కార్యదర్శికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చానని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కార్యదర్శికి ఇచ్చిన లేఖను కూడా ట్విట్టర్‌లో పొందుపర్చారు.

ఈ లేఖలో ఓ టీడీపీ అభిమాని పొరపాటును పట్టేశారు. లేఖలో ఓ చోట తేదీ తప్పు పొందుపర్చారు. దీనిని ఉద్దేశించి సదరు టీడీపీ సెటైర్లు వేశారు. చిన్నపిల్లాడు కూడా తాను లేఖ రాసినప్పుడు ఏమైనా తప్పులు ఉన్నాయేమోనని సరిచూసుకుంటాడని, కానీ పెద్ద వేతనం తీసుకుంటున్న రాజ్యసభ సభ్యులు మాత్రం తప్పుడు తేదీ వేశారని, మీరు మీ స్నేహితుడు విజయసాయి అడుగుజాడల్లో నడుస్తున్నారని ఎద్దేవా చేశారు.

English summary
Today, I've submitted a notice for BREACH OF PRIVILEGE against TDP to the Rajya Sabha Secretariat for initiating penal proceedings for blatantly threatening me of "DIRE CONSEQUENCES" after my speech in Rajya Sabha where I exposed TDP govt. Submitted video proof of my complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X