హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసద్‌కు ఇస్తానన్న 25లక్షలు అవే: బాబువైపు జీవీఎల్ వేలు, 'పవన్, జగన్‌లు పోటీ చేయట్లేదేం'

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీలు కుటుంబ పార్టీలు అని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు మంగళవారం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓ కుటుంబ సభ్యురాలికి టిక్కెట్ ఇచ్చారని విమర్శించారు.

అంతా తారుమారు, తగ్గిన టీడీపీ.. 14వ సీటు వదిలేసిన తమ్ముళ్లు: లాస్ట్ మినిట్లో ఊహించని ట్విస్ట్‌లెన్నోఅంతా తారుమారు, తగ్గిన టీడీపీ.. 14వ సీటు వదిలేసిన తమ్ముళ్లు: లాస్ట్ మినిట్లో ఊహించని ట్విస్ట్‌లెన్నో

రూ.25 లక్షల ఆఫర్‌పై కాంగ్రెస్ సమాధానం చెప్పాలి

రూ.25 లక్షల ఆఫర్‌పై కాంగ్రెస్ సమాధానం చెప్పాలి

అధికారంలోకి వచ్చి పార్టీలు, ప్రభుత్వాలు ప్రజలు కేంద్రంగా పాలన సాగించాలని, కానీ కుటుంబం కేంద్రంగా చేయడం సరికాదని జీవీఎల్ వ్యాఖ్యానించారు. మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రచారానికి వెళ్లకుంటే రూ.25 లక్షలు ఇస్తాననే ఆఫర్ పైన కాంగ్రెస్ నేతలు మాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 ఏపీ నుంచి వచ్చిన రూ.500 కోట్లలో భాగమే ఈ డబ్బులు

ఏపీ నుంచి వచ్చిన రూ.500 కోట్లలో భాగమే ఈ డబ్బులు

ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రూ.500 కోట్లలో భాగమే ఈ డబ్బులు ఇస్తామని చెప్పి ఉంటారని జీవీఎల్ ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికల్లో డబ్బులు గుప్పించేందుకు చంద్రబాబు తెలంగాణకు రూ.500 కోట్లు పంపిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. జీవీఎల్ ఇంకా మాట్లాడుతూ.. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఓవైసీ భాయ్... భాయ్ అన్నారు. ఓవైసీ ఎన్నికల ఎంటర్‌టైనర్‌గా మారారని జీవీఎల్ ఎద్దేవా చేశారు.

పనన్, జగన్‌లు తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదు

పనన్, జగన్‌లు తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు తమ పార్టీల తరఫున నామినేషన్లు వేయకుండా ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌లతో కుమ్మక్కయ్యారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తిరుపతిలో అన్నారు.

పార్లమెంటుకు ఎలా పని చేస్తారు?

పార్లమెంటుకు ఎలా పని చేస్తారు?

అసెంబ్లీకి పోటీ చేయలేని వారు పార్లమెంటుకు ఎలా పని చేస్తారని రఘువీరా ప్రశ్నించారు. తాము తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీనిపై రఘువీరా పైవిధంగా మాట్లాడారు. ఆయన ఇంకా మాట్లాడుతూ... జగన్, పవన్ కళ్యాణ్‌ల మద్దతు ఎవరికో చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు పోటీ చేస్తారో చెప్పాలని నిలదీశారు. తెలంగాణలో తెరాస బీ టీమ్ అయితే ఏపీలో జగన్, పవన్‌లు నవ్యాంధ్రలో బీ టీంలుగా మారారని చెప్పారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రభంజనాన్ని తట్టుకోలేకనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు మోడీ మద్దతు పలికారని చెప్పారు.

English summary
BJP Rajya Sabha Member GVL Narasimha Rao comments on AP CM Chandrababu Naidu over Rs 25 laksh offer to MIM chief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X