వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు హితవు ...తెలివైన ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ ఉల్లంఘించరు అన్న జీవీఎల్

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఎన్నికల కమిషన్‌పై చంద్రబాబునాయుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు సూచించినట్టుగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని జీవీఎల్ సూచించారు.ఈసీ మార్గదర్శకాలను పాటించాలని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు .

గురువారం నాడు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన నియమావళిని పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పదేపదే పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు .ఎన్నికల సంఘం నియమ నిబంధనలను అందరూ తప్పక పాటించాలని ఆయన కోరారు.ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడ చంద్రబాబునాయుడు హడావుడి ఇంకా తగ్గలేదన్నారు. ఎన్నికల కోడ్ ఉండగా అధికారిక సమీక్షలు నిర్వహించటం తప్పని జీవీఎల్ అన్నారు.

GVL counsel to Chandila Babu ... GVL, a wise intelligent chief does not violate election code

తెలివైన ముఖ్యమంత్రిగా చెప్పుకొనే చంద్రబాబునాయుడు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించరని తాను భావిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.తనపై దాడి చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదన్నారు. గత ఏడాది నవంబర్ మాసంలో అతను నిర్వహించే కొన్ని సంస్థలపై దాడులు జరిగిన విషయం తనకు మీడియా ద్వారా తెలిసిందని జీవీఎల్ చెప్పారు. జీవీఎల్ పై షూతో దాడి చేసిన ఘటన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని , అది మంచిద కాదని హితవు పలికారు.

English summary
BJP MP GVL Narasimha Rao told the media in New Delhi that it is necessary to follow the code to be followed during elections. But he said that Chandrababu repeatedly violate the election code of conduct . GVL said it was wrong to maintain official reviews while the election code.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X