వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదాయం మీకు.. నిందలు మాకా?: జగన్ సర్కారుపై జీవీఎల్ నిప్పులు, టీడీపీపైనా..

|
Google Oneindia TeluguNews

అమరావతి: మద్యం విషయంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మండిపడ్డారు. వివిధ రాష్ట్రాల వినతుల మేరకే కేంద్రం లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇచ్చిందని, అయితే, మద్యం అమ్మకాల విషయంలో పూర్తిగా రాష్ట్రాలకే వదిలేసిందని తెలిపారు.

మద్యంపై రాష్ట్రాలదే నిర్ణయం

మద్యంపై రాష్ట్రాలదే నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై పార్టీలు అనవసర అపోహలు కలగజేస్తున్నాయని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం అమ్మకాలపై నిర్ణయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకే వెళ్తుందని తెలిపారు.

ఏపీ మంత్రులు అలా ప్రచారం చేస్తారా?

ఏపీ మంత్రులు అలా ప్రచారం చేస్తారా?

కేంద్రం ఆదేశించడం వల్లే మద్యం విక్రయాలు ప్రారంభించామని ఏపీ మంత్రులు తప్పుడు ప్రచారం చేయడంపై జీవీఎల్ మండిపడ్డారు. కేంద్రం ఆదేశిస్తే మిగితా రాష్ట్రాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రం కేవలం సడలింపులు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. 75 శాతం ధరలు పెంచి అమ్మాలనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిది కదా? జీవీఎల్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని కేంద్రంపై రుద్దడం ఏంటని నిలదీశారు.

ఆదాయం మీకు నిందలు మాకా?

ఆదాయం మీకు నిందలు మాకా?

మద్యం అమ్మకాలపై ఆగమేఘాలపై ఎందుకు నిర్ణయాలు తీసుకున్నారని జీవీఎల్ వైసీపీ సర్కారును ప్రశ్నించారు. మద్యం విషయంలో వైసీపీ, టీడీపీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ఆదాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని కేంద్రంపై నిందలు వేయడం సరికాదని జీవీఎల్ హితవు పలికారు. మద్యపాన నిషేధం అంటున్న వైసీపీ సర్కారు ఎందుకు షాపులు తెరిచింది? నిషేధం అమలుకు ఇది సరైన సమయం కాదా? అని ప్రశ్నించారు.

ప్రజల ప్రాణాల పట్టని వైసీపీ సర్కారంటూ..

ప్రజల ప్రాణాల పట్టని వైసీపీ సర్కారంటూ..


ఏపీలో మద్యం అమ్మకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో మద్యం ప్రియులు షాపుల ముందు బారులు తీరుతున్నారు. అక్కడ సామాజిక దూరం అనే మాటకు అర్థమే లేకుండా పోయింది. మాస్కులు కూడా ధరించడం లేదు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి మరింతగా పెరిగే అవకాశం ఉందని అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీలు వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కరోనా వ్యాపిస్తున్న సమయంలో మద్యం షాపులు ప్రారంభించడం అవసరమా? అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రజల ప్రాణాలకు జగన్ సర్కారు విలువ ఇవ్వడం లేదని మండిపడుతున్నారు.

English summary
gvl narasimha rao hits out at ysrcp govt for liquor shops issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X