• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విశాఖ రైల్వే జోన్‌పై స్పష్టత, హోదాతో ప్రయోజనమేంటి? ఏపీని కేంద్ర పాలిత ప్రాంతం చేయలా?: జీవీఎల్

|
Google Oneindia TeluguNews

అమరావతి: విశాఖ రైల్వే జోన్, ఏపీకి ప్రత్యేక విషయాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాతో ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని వ్యాఖ్యానించారు. స్పెషల్ స్టేటస్ అనేది టీడీపీ, వైసీపీ పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడానికి ఉపయోగించే రాజకీయ అంశమైపోయిందన్నారు. పార్లమెంటులో జీవీఎల్ మంగళవారం మాట్లాడారు.

Vizag Railway Zone పై క్లారిటీ , Special Status పేరుతో AP కి అన్యాయం | Oneindia Telugu
ప్రత్యేక హోదాతో వచ్చేదేంలేదు: జీవీఎల్

ప్రత్యేక హోదాతో వచ్చేదేంలేదు: జీవీఎల్

ప్రత్యేక హోదాకు పారిశ్రామిక రాయితీలకు ఎలాంటి సంబంధం లేదన్నారు జీవీఎల్. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కోరారు. రాజకీయ కారణాలతో గతంలో ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని తిరస్కరించారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా అంశం లేదన్న జీవీఎల్.. 14వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా లేదని చెప్పిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాకు బదులుగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ వచ్చిందన్నారు జీవీఎల్ నర్సింహారావు.

ఏపీని కేంద్రపాలిత ప్రాంతం చేయమంటారా?: జీవీఎల్ నర్సింహారావు

ఏపీని కేంద్రపాలిత ప్రాంతం చేయమంటారా?: జీవీఎల్ నర్సింహారావు

పాండిచ్చేరి లాంటి ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వాలంటే, ఏపీని కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయమంటారా? అని జీవీఎల్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా పేరుతో ఏపీకి మళ్లీ అన్యాయం చేయొద్దని జీవీఎల్ కోరారు. ప్రత్యేక హోదా అనే పేరుతో వచ్చేదేమీ లేదని, అంతకు మించి రాష్ట్రానికి నిధులు అందుతున్నాయని తెలిపారు. పెళ్లిలో అంబాసిడర్ కారు ఇస్తానని మాట ఇచ్చాక, అంబాసిడర్ కారు ప్రొడక్షన్ ఆగిపోతే, మాకు అదే కారు కావాలని గోల చేసినట్టుగా ఏపీ నేతల తీరు ఉందని జీవీఎల్ నర్సింహారావు ఎద్దేవా చేశారు.

విశాఖ రైల్వే జోన్ ఖరారైందంటూ జీవీఎల్ వ్యాఖ్యలు

విశాఖ రైల్వే జోన్ ఖరారైందంటూ జీవీఎల్ వ్యాఖ్యలు

మరోవైపు, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో జీవీఎల్ భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు త్వరలో కొలిక్కి వస్తుందన్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రక్రియ ప్రారంభం కాబోతోందన్నారు. డీపీఆర్‌ను త్వరలోనే ఆమోదించి రైల్వే జోన్ ప్రక్రియను మొదలు పెట్టే దిశగా కేంద్ర రైల్వే శాఖ, రైల్వే బోర్డు నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు. పూర్తిస్థాయి ఫ్యూజుబిలిటీ లేదని ఈ రోజుకి కూడా రైల్వే బోర్డు, రైల్వే శాఖలో ఆలోచన ఉన్నప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారన్నారు. భవన నిర్మాణం కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోందని జీవీఎల్ నర్సింహరావు వెల్లడించారు.

కేంద్రం నుంచి ఏపీకి అత్యధిక నిధులు: జీవీఎల్

కేంద్రం నుంచి ఏపీకి అత్యధిక నిధులు: జీవీఎల్

కేంద్రం గత మూడు నాలుగు సంవత్సరాల్లో పన్నుల రూపంలో సేకరించిన ధనం కన్నా ఎక్కువ నిధులను ఏపీకి ఇచ్చింది. 2020-21 లో పన్నుల రూపంలో 57,472 కోట్ల ఆదాయం వస్తే పన్నుల వికేంద్రీకరణ, గ్రాంట్ల రూపంలో, ఇతర రూపాల్లో 75 వేల కోట్లు ఇచ్చింది. ఏపీకి ఆర్ధికంగా వనరులు లేని కారణంగా గ్రాంట్ల రూపంలో, అదనపు నిధులు కేంద్రం ఇస్తుంది. కేంద్రం ఏపీ పట్ల చూపిస్తున్న చొరవగా భావిస్తున్నాం. విశాఖలో హెచ్ పీసీఎల్ ద్వారా రిఫైనరీ విభాగంలో 26వేల కోట్ల పెట్టుబడులు పెడుతుంది. ఏపీలో నిలిచిపోయిన 6 రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని కేంద్ర రైల్వే మంత్రిని కోరా. వీలైనంత నిధులు కేంద్రం నుంచి కేటాయిస్తామని, భూ కేటాయింపుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని కేంద్రమంత్రి కోరారు. రాష్ట్రంలో కొత్త రైల్వే ప్రాజెక్టులు, కొత్త రైళ్లు ప్రారంభించాలని కోరినట్లు జీవీఎల్ తెలిపారు.

English summary
GVL Narasimha Rao key comments on Visakha Railway zone and andhra pradesh special status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X