వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘రాజధాని’పై కేంద్రం జోక్యం ఉండదు: జీవీఎల్ కీలక వ్యాఖ్యలు, దళిత వ్యతిరేకులా అంటూ సీఏఏపై...

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది కాదని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని తాను మొదట్నుంచీ చెబుతున్నామని చెప్పారు. సోమవారం జీవీఎల్ నర్సింహారావు మీడియాతో మాట్లాడారు.

మూడు రాజధానులు బాగానే ఉంది కానీ..: సీఎం జగన్‌కు జీవీఎల్ నర్సింహారావు కీలక సూచనలుమూడు రాజధానులు బాగానే ఉంది కానీ..: సీఎం జగన్‌కు జీవీఎల్ నర్సింహారావు కీలక సూచనలు

రాజధాని మార్చమని కేంద్రం చెప్పదు..

రాజధాని మార్చమని కేంద్రం చెప్పదు..

బీజేపీ అధికారికంగా చెబుతున్న మాట ఇది అని జీవీఎల్ నర్సింహారావు అన్నారు. ఎవరేం చెప్పినా తాను చెప్పేదే పార్టీ విధానమని తెలిపారు. రాజధాని పెట్టాలని కేంద్రం సూచించలేదని అన్నారు. రాజధాని మార్చాలని కూడా కేంద్రం చెప్పదని స్పష్టం చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అడిగితే కేంద్రం సూచనలు చేస్తుందని తెలిపారు. తాను జాతీయ పార్టీ విధానాన్ని చెబుతున్నానని జీవీఎల్ వ్యాఖ్యానించారు. ఏ పార్టీలోనూ ఏకాభిప్రాయం లేదని అన్నారు. తమ పార్టీలోని కొందరు నేతలు చెప్పిన మాటలు వారి వ్యక్తిగతమేనని ఆయన అన్నారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని అన్నారు.

సీఏఏపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..

సీఏఏపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..

అంతకుముందు సీఏఏ, ఎన్ఆర్సీలపై జీవీఎల్ మాట్లాడారు. సీఏఏపై భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యర్తలు ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలను వివరిస్తారని చెప్పారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. సీఏఏపై కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

భారతీయులకు నష్టం లేదు.. వారికోసమే..

భారతీయులకు నష్టం లేదు.. వారికోసమే..

సీఏఏ భారతీయులకు సంబంధించినది కాదని జీవీఎల్ అన్నారు. ఏ భారతీయులకు కూడా సీఏఏతో నష్టం లేదని అన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మతహింసను ఎదుర్కొని, అక్కడ బతకలేని స్థితిలో మనదేశంలోకి వచ్చిన శరణార్థులకు ఈ చట్టం ద్వారా భారత పౌరసత్వ కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ చట్టం ద్వారా భారతీయుల పౌరసత్వం పొందని, ఇది శరణార్థులకు పౌరసత్వం కల్పించే చట్టమని అన్నారు.

విపక్షాలు పాకిస్థాన్‌కు వత్తాసు పలుకుతున్నాయి..

విపక్షాలు పాకిస్థాన్‌కు వత్తాసు పలుకుతున్నాయి..

అయితే, కాంగ్రెస్ సహా విపక్షాలు సీఏఏపై అపోహలు, అసత్యాలు ప్రచారం చేస్తూ ముస్లిం వర్గాల్లో అభద్రతా భావాన్ని కలగజేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నాయని మండిపడ్డారు. చట్టంపై అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు ముస్లిం దేశాలని.. అక్కడ మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. భారత విభజన సమయంలో మత ఆధారంగా ఏర్పడిన పాకిస్థాన్‌లో 23శాతం ఉన్న మైనార్టీలు ఉన్నారని, ఇప్పుడు కేవలం 3శాతానికి తగ్గిపోయారని తెలిపారు. 70ఏళ్లలో జనాభా పెరగాలి కానీ.. తగ్డడం ఏంటని ప్రశ్నించారు. మతమార్పడిలు, హింస వల్లే మైనార్టీలు తగ్గిపోయారని అన్నారు. పాకిస్థాన్‌ను తప్పుబట్టాల్సిన కాంగ్రెస్ సహా విపక్షాలు.. ఆ దేశానికి వత్తాసు పలుకుతున్నాయని మండిపడ్డారు.

ఆ రెండు దేశాల్లో మైనార్టీలపై తీవ్ర వివక్ష..

ఆ రెండు దేశాల్లో మైనార్టీలపై తీవ్ర వివక్ష..

బంగ్లాదేశ్‌లో కూడా ఆ దేశం ఏర్పడిన సమయంలో 22శాతం ఉన్న మైనార్టీలు ఇప్పుడు కేవలం 8శాతానికి తగ్గిపోయారని తెలిపారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో మైనార్టీలు వివక్షకు గురవుతున్నారనడానికి చాలా ఆధారాలున్నాయని చెప్పారు. ఒక ముస్లిం పాకిస్థాన్ పార్లమెంటు సభ్యురాలు కూడా తమ దేశంలో హిందువులు, క్రిస్టియన్లు వివక్షకు గురవుతున్నారని చెప్పారని తెలిపారు. పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్ మూడు రోజుల క్రితం మాట్లాడుతూ.. డానిష్ కనేరియా అనే హిందూ మతానికి చెందిన పాక్ క్రికెటర్‌ను వెలివేసినట్లు చూసేవాళ్లమని, సమానంగా చూసేవాళ్లం కాదని ఆయనే చెప్పారని జీవీఎల్ చెప్పారు. డానిష్ కనేరియా కూడా ఇటీవల బయటికి వచ్చి తనను కాపాడాలంటూ మీడియా ముందుకు రావడం ఇందుకు నిదర్శనమని అన్నారు. మనదేశంలో మాత్రం ముస్లిం వర్గానికి చెందిన అజహారుద్దీన్ టీమిండియా కెప్టెన్ గా చేశారని, సానియా మీర్జా లాంటి క్రీడాకారులను మనం ఎంతో గౌరవిస్తున్నాం. అబ్దుల్ కలాం, ఫక్రూద్దీన్ లాంటి వారు రాష్ట్రపతులు అయ్యారు. బాలీవుడ్‌లో అగ్రతారలుగా అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఉన్నారని, వారందరనీ మనం అభిమానిస్తామని, వారిని మతం ప్రాతిపదికన చూడమని.. భారతీయులుగానే చూస్తామని చెప్పారు. పాక్ మొదటి న్యాయశాఖ మంత్రి వేధింపులు ఎదుర్కొని మనదేశానికి తిరిగొచ్చాడని తెలిపారు.

మీరు దళితులకు వ్యతిరేకమా?

మీరు దళితులకు వ్యతిరేకమా?


పౌరసత్వ సవరణ చట్టం ద్వారా పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లో మతపరమైన వివక్షను, వేధింపులను ఎదుర్కొని మనదేశంలోకి వచ్చిన శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వడం జరుగుతుందని జీవీఎల్ చెప్పారు. ఈ చట్టం ద్వారా భారత పౌరసత్వం పొందేవారిలో 65శాతం మంది దళిత హిందువులు ఉన్నారని ఆయన చెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాయావతి, వామపక్షాలు దళిత వ్యతిరేకులా? అని జీవీఎల్ ప్రశ్నించారు.

English summary
BJP MP GVL Narasimha rao on Andhra Pradesh capital issue and CAA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X