India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోటికొచ్చింది మాట్లాడితే ఖబడ్దార్.. నడ్డాపై మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలకు జీవీఎల్ కౌంటర్

|
Google Oneindia TeluguNews

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తాజాగా రాజమండ్రిలో జరిగిన గోదావరి గర్జన సభలో భాగంగా వైసీపీ ప్రభుత్వం పై, సీఎం జగన్ పాలనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ నుంచి అబద్ధాలను పోగేసుకుని జేపీ నడ్డా వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు . జేపీ నడ్డా నోటికొచ్చినట్టు మాట్లాడారని మండిపడ్డారు. ఏపీ అప్పులు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించిన పేర్ని నాని అడ్డంగా బలిసి బరితెగించి అబద్ధాలు చెబుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలకు జేవీఎల్ కౌంటర్

మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలకు జేవీఎల్ కౌంటర్

ఇక మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలకు బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాది పువ్వు పార్టీనా? అడ్డంగా బలిశారు అంటూ నడ్డాను వ్యక్తిగతంగా విమర్శిస్తారా ? అంటూ ప్రశ్నించిన జీవీఎల్ నరసింహారావు, మాజీ మంత్రుల బలిసిన మాటలంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలు మాట్లాడే ప్రతి చెత్త కామెంట్ ను పార్టీ హైకమాండ్ కు తర్జుమా చేసి పంపుతామని జీవీఎల్ వ్యాఖ్యానించారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే చెత్త ఫ్యాన్ పార్టీ అంటూ, ఎప్పుడు ఫ్యాన్ ప్రజల నెత్తి మీద పడుతుందో అని ప్రజలు భయపడుతున్నారని జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు.

కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చించే దమ్ముందా?

కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చించే దమ్ముందా?

మీకు మీరు డబ్బా కొట్టుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని పేర్కొన్న జీవీఎల్, కేంద్రం ఎంతో సహాయం చేసింది , ఆ నిధులను మీరు ఎందుకు ఖర్చు చేశారు అనే అంశాలు బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడే దమ్ము ఉందా అంటూ ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి ఢిల్లీలో పర్యటిస్తున్నది అప్పుల కోసం కాదా అంటూ నిలదీశారు. కొత్తగా తీసుకున్న అప్పుల నుండే పాత అప్పులు చెల్లింపులు జరుగుతున్నాయి అన్నది నిజం కాదా అంటూ మండిపడ్డారు.

 స్థాయి తెలుసుకోకుండా పిచ్చి మాటలు మాట్లాడితే తీవ్ర పరిణామాలు

స్థాయి తెలుసుకోకుండా పిచ్చి మాటలు మాట్లాడితే తీవ్ర పరిణామాలు

లక్షల కోట్ల అప్పు చేసి అప్పుల ఏపీ గా మార్చారు అని అసహనం వ్యక్తం చేశారు జీవీఎల్ నరసింహారావు. కాగ్ లెక్కల ప్రకారం 12 వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా ద్వారా కోట్లు దండుకున్నారని మండిపడ్డారు జీవీఎల్ నరసింహారావు. స్థాయి తెలుసుకోకుండా పిచ్చి మాటలు మాట్లాడితే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇంకోసారి రాజకీయ విమర్శలు కాకుండా రంకెలేస్తే తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.

వ్యక్తిగత విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోము.. టార్గెట్ చేసిన జీవీఎల్

వ్యక్తిగత విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోము.. టార్గెట్ చేసిన జీవీఎల్

కేంద్ర పథకాలకు మీ స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటుంది వాస్తవం కాదా అని జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఎక్కడికి వెళ్లాలన్నా తమ నేతలను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని, జొన్నాడ వెళితే సోము వీర్రాజును అడ్డుకున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏపీ ఏమైనా నిషేధిత ప్రాంతమా? అంటూ ప్రశ్నించారు జీవీఎల్ నరసింహారావు. వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోబోమని, రాజకీయ విమర్శలు అయితే వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై చర్చించటానికి తాము సిద్ధంగా ఉన్నామని జీవీఎల్ నరసింహారావు తేల్చిచెప్పారు.

English summary
GVL Narasimha Rao countered former minister perni Nani's remarks on JP Nadda.GVL warning to perni nani over the attack,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X