• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జిమ్ మాస్టర్ కీచకత్వం: బాబాయే కదాని వెళితే.. కోరిక తీర్చుకుని.. ఆపైన

By Ramesh Babu
|

కడప: వరుసకు బాబాయి అవుతాడు కదాని ఇంటికెళితే నిండా ముంచేశాడు. కనీసం కూతురు వయసులో ఉన్న అమ్మాయి అని కూడా చూడలేదు ఆ కామాంధుడు. బంధుత్వం ముసుగులో మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడడమేకాక ఆ అసభ్యకర దృశ్యాలను వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు.

ఇదొక జిమ్ మాస్టర్ కీచకత్వం. కడప జిల్లాలోని కమలాపురంలో వెలుగులోకి వచ్చింది. చదివిస్తానని చెప్పి ఓ బాలికను తన ఇంటికి తీసుకొచ్చిన సదరు జిమ్ మాస్టర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

 చదివిస్తానని చెప్పి తీసుకొచ్చి...

చదివిస్తానని చెప్పి తీసుకొచ్చి...

కమలాపురంలో జిమ్ నిర్వహిస్తోన్న వ్యక్తికి మైదుకూరులో బంధువులున్నారు. వారి ఇంట్లో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని ఉంది. ఆ విద్యార్థిని తండ్రికి ఈ జిమ్ మాస్టర్ వరుసకు చిన్నాన్న అవుతాడు. కమలాపురంలో తనకు తెలిసిన కాలేజీలో ఇంటర్ చదివిస్తానని చెప్పడంతో బంధువులు ఏమాత్రం అనుమానించకుండా ఆ విద్యార్థినిని అతడి వెంట పంపారు.

 ఎలాగైనా లొంగదీసుకోవాలని...

ఎలాగైనా లొంగదీసుకోవాలని...

మూడు నెలలుగా సదరు విద్యార్థిని అతడి ఇంట్లో ఉంటోంది. దాంతో ఆ బాలికపై ఈ జిమ్ మాస్టర్ కన్ను పడింది. ఎలాగైనా లొంగదీసుకోవాలని భావించి ఆమెకు దగ్గరయ్యేందుకు మాయమాటలు చెప్పసాగాడు. జిమ్ నేర్పిస్తాను.. నేర్చుకుంటే నీవు సొంతంగా జిమ్ పెట్టుకోవచ్చు.. పోలీసు ఉద్యోగానికి కూడా సులువుగా ఎంపిక కావచ్చు అని రకరకాల మాటలు చెబుతూ ఆ బాలికను తనవైపు తిప్పుకున్నాడు.

 హాస్టల్లో చేరిన వదలకుండా...

హాస్టల్లో చేరిన వదలకుండా...

అతడి మాయమాటలకు ఆ అమ్మాయి పూర్తిగా పడిపోయింది. అదే అదనుగా ఆ బాలికను శారీరకంగా లొంగదీసుకున్నాడు. అతడి నైజం తెలిసిన బాలిక ఇక అతడి ఇంట్లో ఉండలేనంటూ మైదుకూరులోని తన ఇంటికి వెళ్లిపోయింది. అనంతరం తాను హాస్టల్లో ఉంటానని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులుబీసీ హాస్టల్లో చేర్పించారు. అక్కడ కూడా ఆ బాలికను ఈ కీచకుడు వదల్లేదు. తాను ఆ బాలికకు బంధువునని చెప్పి హాస్టల్లోంచి బయటికి తీసుకెళ్లి అనుభవించేవాడు.

 ఫొటోలు, వీడియోలు ఉన్నాయని బెదిరించి...

ఫొటోలు, వీడియోలు ఉన్నాయని బెదిరించి...

దీంతో ఆ బాలిక కాలేజీకి వెళ్లడమే మానేసింది. ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలుకావడంతో మళ్లీ కమలాపురానికి వచ్చింది. ఇదే అదనుగా సదరు జిమ్ మాస్టర్ ఆ బాలిక హాల్‌టిక్కెట్ తీసుకుని బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. ‘నీ ఫొటోలు, వీడియోలు నా దగ్గర ఉన్నాయి. వాటిని మీ అమ్మానాన్నకు చూపిస్తా..' అని బెదిరించడంతో ఆ బాలిక పరీక్షలు రాయడం కూడా మానుకుంది.

రంగంలోకి దిగిన పోలీసులు...

రంగంలోకి దిగిన పోలీసులు...

చివరికి అతడి వేధింపులు భరించలేక మార్చి 1వ తేదీన కమలాపురం పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకున్నప్పటికీ ఎస్సై అందుబాటులో లేకపోవడంతో ఆ బాలిక వెనుదిరిగినట్లు తెలుస్తోంది. ఈ ఉదంతం గత కొద్దిరోజులుగా కమలాపురంలో హాట్ టాపిక్‌ మారింది. ఈ నేపథ్యంలో గురువారం డీఎస్పీ కమలాపురం వచ్చి నిందితుడైన జిమ్ మాస్టర్‌ను, ఆ బాలిక బంధువులను విచారించినట్లు తెలిసింది. ఈ మొత్తం కథ పోలీసులు నిందితుడి ద్వారానే తెలుసుకున్నట్లు సమాచారం.

నిజాలన్నీ కక్కించిన పోలీసులు...

నిజాలన్నీ కక్కించిన పోలీసులు...

ఈ ఘటనపై ఫోక్సా చట్టం ప్రకారం కమలాపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తున్నా పోలీసులు మాత్రం వివరాలు బయటికి వెల్లడించడం లేదు. నిందితుడైన జిమ్ మాస్టర్‌ను ఇప్పటికే తమదైనన పద్ధతిలో విచారించిన పోలీసులు ఇంకా అతడి నుంచి మరిన్ని విషయాలు సేకరించాలనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A person who is running a Gym in Kamalapuram of Cuddapah District allegedly sexually assulted his relative girl who belongs to mydukur and is staying in his house studying intermediate. Later the girl went to her own house and staying in BC Hostel. That time also he catched her and taking her to out and fulfilled his desires. At last the girl ended his story by approaching police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more