చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారిని ఉరి తీయాలి, ఆ కలెక్టర్ ఓ ఫూల్: మోహన్ బాబు ఆగ్రహం

ఉద్యోగ విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తే అలాంటి వారికి ఉరిశిక్ష విధించాలని ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు సోమవారం అన్నారు. ఏర్పేడు ప్రమాద బాధిత కుటుంబాలని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ఉద్యోగ విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తే అలాంటి వారికి ఉరిశిక్ష విధించాలని ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు సోమవారం అన్నారు. ఏర్పేడు ప్రమాద బాధిత కుటుంబాలని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

<strong>అవసరం లేదు, వెళ్లిపోండి: జగన్‌కు గ్రామస్తుల షాక్, 'సాక్షి' ఆగ్రహం </strong>అవసరం లేదు, వెళ్లిపోండి: జగన్‌కు గ్రామస్తుల షాక్, 'సాక్షి' ఆగ్రహం

తాను ఎవరినీ విమర్శించడానికి ఇక్కడకు రాలేదని, కేవలం పరామర్శకు మాత్రమే వచ్చానని చెప్పారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.

నిజానిజాలు బయటకు రావాలి

నిజానిజాలు బయటకు రావాలి

ఏర్పేడు ప్రమాద ప్రమాదం వెనుక నిజానిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే అలాంటి వారికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గతంలో ఉన్న ఓ కలెక్టర్ గురించి మాట్లాడారు.

ఆ కలెక్టర్ ఓ ఫూల్

ఆ కలెక్టర్ ఓ ఫూల్

అప్పట్లో ఓ కలెక్టర్ ఉండేవారని, అతను ఓ ఫూల్ అని మండిపడ్డారు. ఇసుక మాఫియాపై, అలాగే మోదుగులపాలెం బ్రిడ్జి కోసం తాను ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందించలేదని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆత్మగౌరవంతో బతుకుతారు..

ఆత్మగౌరవంతో బతుకుతారు..

సిపిఐ నేత నారాయణ కూడా ఏర్పేడు ప్రమాద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. మునగలపాలెం గ్రామస్తులు ఆత్మగౌరవంతో బతుకుతారని చెప్పారు. ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వస్తే పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ఎస్పీపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

వనజాక్షి విషయంలో..

వనజాక్షి విషయంలో..

గతంలో వనజాక్షి విషయంలో చంద్రబాబు దూషించారని, అందుకే ఇసుక మాఫియా రెచ్చిపోతోందని నారాయణ మండిపడ్డారు. ఏర్పేడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఇసుక మాఫియా రెచ్చిపోతోందని, చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు.

English summary
Actor and Former MP Mohan Babu on Monday demanded to hang who are in neglect in duty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X