ఎస్సైతో వివాహేతర సంబంధం, భర్తను దూరం పెట్టిన బ్యూటీషియన్: హత్యకు కుట్ర చేస్తున్నారంటూ..
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఎస్సై విజయ్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న చిత్రాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
విజయవాడ: కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఎస్సై విజయ్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న చిత్రాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
భర్తను దూరంగా పెట్టింది
దీని వెనుక ఆ మహిళ భర్త హస్తముందని చెబుతున్నారు. విజయ్ గతంలో ముసునూరులో పనిచేసినప్పుడు నూజివీడుకు చెందిన ఓ బ్యూటీషియన్తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మహిళ తన భర్తని దూరంగా పెట్టింది.
విడాకులు తీసుకొని ఎస్సైని వివాహం చేసుకోవాలని
విడాకులు తీసుకొని ఎస్సైని వివాహం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉందని అంటున్నారు. ఎస్సైతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను దూరంగా ఉంచడంతో ఆమె భర్త మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆ భర్త వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు.
హత్యకు కుట్ర పన్నారని ఆరోపణ
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నానన్న కారణంతో తనను హత్య చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆ భర్త ఆరోపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో ప్రచారం కావడంతో కృష్ణా జిల్లా ఎస్పీ ఎస్సైపై చర్యలు తీసుకున్నారు. అతడిని వీఆర్లో ఉంచారు.
అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నానని..
విజయ్ పోలీసాఫీసర్ అని, అతను ఏమైనా చేయగలడని, దయచేసి ఎవరైనా సాయం చేయాలని, వారి అక్రమ సంబంధానికి అడ్డుపడతానని తనను హత్య చేయించడానికి ప్రయత్నిస్తున్నారని అతను ఆరోపిస్తున్నారు. కాగా, తనను వదిలేసిందన్న కోపంతో, తన భార్య తప్పు చేసిందన్న ఆగ్రహంతో అతను ఈ పోస్టింగులు పెట్టి ఉంటాడని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు.