• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేటి నుంచే అమరావతిలో ఆనంద నగరాల సదస్సు...లక్ష్యం ఇదే!

|

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆనంద నగరాల శిఖరాగ్ర సదస్సుకు అత్యంత ఘనంగా ఆతిథ్యం ఇచ్చేందుకు నవ్యాంధ్ర రాజధాని అమరావతి సంసిద్దమైంది. ఎపిలో తొలిసారిగా జరిగే ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్‌ని అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా నిర్వహించేందుకు సీఆర్డీయే, గుంటూరు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేశాయి.

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపాన సీకే కన్వెన్షన్‌ హాల్‌లో జరిగే ఈ కార్యక్రమానికి దేశవిదేశాల ప్రముఖులు, ప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో భద్రతాపరంగా కూడా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రపంచ ఆనంద నగరాల్లో అమరావతి కూడా అగ్రస్థానంలో ఉండాలన్న పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదస్సు ద్వారా నవ్యాంధ్ర రాజధాని అమరావతి భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది ప్రపంచానికి చాటాలని భావిస్తున్నారు.

సదస్సు...స్పెషల్ ఎట్రాక్షన్స్

సదస్సు...స్పెషల్ ఎట్రాక్షన్స్

మంగళగిరిలోని ఏపీ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు సమీపంలో ఎన్‌హెచ్‌-16ని పక్కనే నూతనంగా నిర్మించిన సీకే కన్వెన్షన్స్‌ ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ కన్వెన్షన్‌ సెంటర్‌ని మెట్రో నగరాల స్థాయిలో ఇక్కడ నిర్మించడం విశేషం. భారీ సెమినార్‌ హాల్‌తో పాటు చర్చాగోష్టులు నిర్వహించేందుకు మినీ హాల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు ఇలాంటి కన్వెన్షన్‌ హాల్స్‌ హైదరాబాద్‌, విశాఖపట్టణంకే పరిమితం కాగా ఆ తరువాత మంగళగిరిలోనే ఇది ఏర్పాటు కావడం గమనార్హం. ప్రపంచదేశాల ప్రతినిధులను ఆకర్షించేందుకు ఇక్కడ అమరావతి పెవీలియన్‌తో పాటు ఎగ్జిబిషన్‌ని కూడా ఏర్పాటుచేశారు.

 దేశవిదేశాల...అతిధిల రాక

దేశవిదేశాల...అతిధిల రాక

ఈ సదస్సులో పాల్గొనేందుకు ఫిన్లాండ్‌, భూటాన్‌, యూఏఈ, యూకే, సింగపూర్‌ తదితర 27 దేశాల నుంచి 200 మంది ప్రతినిధులు అమరావతికి తరలివచ్చి ఈ ఆనంద నగరాల సదస్సులో పాల్గొని తమ అనుభవాలు, అభిప్రాయాలు, సలహాలు,సూచనలు తెలియపరచనున్నారు. అలానే మన రాష్ట్రంలోని అన్ని మునిసిపల్‌ కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీల నుంచి మేయర్లు, ఛైర్మన్లు కూడా ఈ సదస్సుకు హాజరవుతారు.

సిఎం చంద్రబాబు...లక్ష్యానికి అనుగుణంగా...

సిఎం చంద్రబాబు...లక్ష్యానికి అనుగుణంగా...

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ఒక అత్యద్భుత ఆనంద నగరంగా చేయడమే తన అభిమతమని సీఎం చంద్రబాబు ఇప్పటికే అనేక సందర్భాల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నగరంలో మానవ వనరులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆనందనగరాల పట్టికలో అమరావతి నెంబర్‌ టాప్‌ పొజిషన్‌లో ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి సదస్సు కావడంతో గుంటూరు జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఏర్పాట్లను ఘనంగా చేస్తుంది. జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను మంగళగిరిలోనే కేంద్రీకరించి వివిధ బాధ్యతలు కేటాయించారు.

ఆనంద నగరాల సదస్సుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయినట్లు సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు.

సదస్సు...జరిగేది ఇలా...

సదస్సు...జరిగేది ఇలా...

మంగళవారం ఉదయం 11 నుంచి 12.15 గంటల మధ్యన సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.15 నుంచి 1 గంట వరకు ఆనంద పలుకులపై సీఎంతో పాటు ఈషా పౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యన భోజన విరామం.మధ్యాహ్నం 2 నుంచి 3.30 వరకు 21వ శతాబ్ధంలో నగరాలుపై చర్చాగోష్టి జరుగుతుంది. మధ్యాహ్నం 3.45 గంటల నుంచి సాయంత్రం 5.15 వరకు జీవన సౌలభ్యంపై చర్చ జరుగుతుంది. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటలకు వరకు ఆనందకరమైన అభ్యసంపై చర్చ జరుగుతుంది. రాత్రి 7.30 గంటల నుంచి ఆహ్వానితుకు సీఎం చంద్రబాబు డిన్నర్‌ ఇస్తారు.

రెండో రోజు...సదస్సు

రెండో రోజు...సదస్సు

ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు ఈషా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో యోగ శిక్షణ శిబిరం. ఉదయం 10 నుంచి 11.30 గంటల మధ్యన నగరంలో ఆనందం లెక్కింపుపై ప్యానల్‌ చర్చ. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్బన్‌-టెక్‌ పిచ్‌ పోటీ(పార్టు-1). మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు ఆనందకరమైన జీవనంపై చర్చా గోష్టి. మధ్యాహ్నం 3.45 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు క్లీన్‌, బ్లూ, గ్రీన్‌పై చర్చ. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు హ్యాపీ సిటీ ఇండెక్స్‌కి ప్రయాణం ప్రారంభంపై చర్చ. మరోవైపు సాయంత్రం 5.15 నుంచి 7 గంటల మధ్యన అర్బన్‌ -టెక్‌ పిచ్‌ కాంపీటిషన్‌ (పార్టు-2).

చివరి రోజు...ముగింపు ఇలా...

చివరి రోజు...ముగింపు ఇలా...

ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు సిటీ లీడర్స్‌ ల్యాబ్‌: నగరాలు ఎదుర్కొంటున్న పెను సవాళ్లను పరిష్కరించడంపై చర్చ. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు అమరావతి రాజధాని రైతుల అభిప్రాయాలపై చర్చ. ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు అవసరం, సంపత్తు, శ్రేయస్సుపై చర్చ. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3.30 గంటల మధ్యన ముగింపు సదస్సు కార్యక్రమం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amaravati: The State government will host "Happy Cities Summit" the first edition of an annual global event on urban innovation, in Amaravathi from April 10 to 12. The summit is aimed at bringing together experts in the global urban landscape such as designers, planners, city leaders, industry and entrepreneurs to discuss and share best practices, innovations and ideas for Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more