హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చాలా మార్చాలి, కానీ కొద్దిగే చేశాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌కు నివేదిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల ఆందోళనను, ఆవేదనను అర్థం చేసుకొని తాము సిలబస్‌లో స్వల్ప మార్పులు చేశామని ఆచార్య హరగోపాల్ గురువారం అన్నారు. టీఎస్పీఎస్సీ మార్పుల పైన హరగోపాల్ కమిటీ టీఎస్పీఎస్సీ చైర్మన్ చక్రపాణికి నివేదికను అందించింది. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడారు.

సిలబస్‌లో చాలా మార్పులు చేయాలన్నారు. విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని తాము స్వల్ప మార్పులు చేశామని చెప్పారు. నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకున్నామన్నారు. 2013 తర్వాత గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ 1లోకి మారుస్తూ గత ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు.

సిలబస్, పరీక్ష విధానాల్లో చాలా మార్పులు చేయవలసి ఉందని చెప్పారు. సర్వీస్ కమిషన్ ఈ నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలన్నారు. ప్రభుత్వం దీనిని సానుకూలంగా పరిశీలిస్తుందని భావిస్తున్నామన్నారు. విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకొని ప్రభుత్వం కూడా దీనిని గుర్తించాలని కోదండరామ్ అన్నారు.

Haragopal subimts report to TSPSC chairman

ఉద్యోగ అవకాశాలు పెంచాలని ప్రభుత్వానికి సూచిస్తున్నామన్నారు. గ్రూప్ టూలో ఆబ్జెక్టివ్ విధానం ఉండాలని చెప్పారు. రాష్ట్ర పునర్ నిర్మాణంలో భాగంగా టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీని నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అని హరగోపాల్ అన్నారు. పునర్ నిర్మాణానికి ప్రభుత్వ యంత్రాంగం విస్తరించాలన్నారు.

ఆర్థిక శాఖ అనుమతితో ఖాళీల పైన సమాచారం ఇస్తే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చక్రపాణి చెప్పారు. మార్పుల పైన ప్రభుత్వం పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు. ఇంకా తాను హరగోపాల్ ఇచ్చిన నివేదికను చూడలేదని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల పైన ప్రభుత్వం స్పష్టం చేయాలని కోదండరామ్ అన్నారు.

English summary
Professor Haragopal subimts report to TSPSC chairman Chakrapani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X