వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోము వీర్రాజు కరెక్ట్!: చంద్రబాబుకు హరిబాబు దెబ్బ, జగన్-పవన్‌లకు కౌంటర్

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఏపీ బీజేపీ అధ్యక్షులు కంభంపాటి హరిబాబు శుక్రవారం తమ పార్టీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజును వెనుకేసుకొచ్చారు. సోము వీర్రాజు పదేపదే టీడీపీపై, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.

బాబు చంపే ప్రయత్నం చేశారు, చిరంజీవి సహా డ్రామాలు, అదే గతి పడుతుంది: అంబటిబాబు చంపే ప్రయత్నం చేశారు, చిరంజీవి సహా డ్రామాలు, అదే గతి పడుతుంది: అంబటి

Recommended Video

BJP Leader Fires At TDP And Congress

ఆయన వ్యాఖ్యలపై హరిబాబు మాట్లాడుతూ.. ఆయన వ్యాఖ్యలు ఎవరి పైనా వ్యక్తిగతంగా అనేది ఉండదని చెప్పారు. వీర్రాజు సహా ఎవరు మాట్లాడినా పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే మాట్లాడుతారని చెప్పారు.

జగన్, పవన్ కళ్యాణ్‌లకు కౌంటర్

జగన్, పవన్ కళ్యాణ్‌లకు కౌంటర్

నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్, అవిశ్వాసం పెట్టాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి కూడా హరిబాబు మాట్లాడారు. కొన్ని పార్టీలు రాజకీయ మనుగడ కోసమే అవిశ్వాసం అంటున్నాయని కౌంటర్ ఇచ్చారు.

గంటా-హరిబాబుల భేటీ

గంటా-హరిబాబుల భేటీ

అంతకుముందు, మంత్రి గంటా శ్రీనివాస రావు, హరిబాబులు సమావేశమయ్యారు. వారు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇటీవల కేంద్ర హామీలు, ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ, బీజేపీ నేతల మధ్య వాగ్యుద్ధం సాగుతోన్న విషయం తెలిసిందే.

 వీర్రాజును వెనుకేసుకొచ్చిన హరిబాబు

వీర్రాజును వెనుకేసుకొచ్చిన హరిబాబు

చంద్రబాబు, టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న సోము వీర్రాజును హరిబాబు వెనుకేసుకు రావడంతోనే బీజేపీ వైఖరి తేటతెల్లమవుతోందని అంటున్నారు. హైదా అంటే గతంలో జైలుకేనని చంద్రబాబు అన్నారని, ఇప్పుడు ఎవరు జైలుకు వెల్లాలో చెప్పాలని, హోదాతో ఒరిగేదేమీ లేదని కూడా అన్నారని, ఇప్పుడు మళ్లీ హోదా ఎత్తుతున్నారని, మీడియా ప్రతినిధులు ఆయనను నిలదీయాలని, ఉద్యమాలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారని, ఇప్పుడు చంద్రబాబుకు ఏ చట్టం వర్తిస్తుందో చెప్పాలని బీజేపీ నేత ఘాటుగా మాట్లాడారు.

 బాబుకు షాక్.. తెరపైకి రాయలసీమ బీజేపీ

బాబుకు షాక్.. తెరపైకి రాయలసీమ బీజేపీ

ప్రత్యేక హోదా, విభజన హామీలు అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తెరపైకి రాయలసీమ బీజేపీ నేతలు వచ్చారు. వారు సీమ డిమాండ్లు వినిపిస్తున్నారు. హైకోర్టును రాయలసీమలోనే ఏర్పాటు చేయాలన్నారు. అమరావతిని మరో హైదరాబాద్ చేయవద్దని మండిపడ్డారు. రాయలసీమను టీడీపీ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు.

English summary
Andhra Pradesh BJP chief Hari Babu supported party MLC Somu Veerraju for his comments on Telugudesam and Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X