వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి బంద్‌కు హరికృష్ణ మద్దతు: పయ్యావుల సూచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harikrishna
హైదరాబాద్: విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన 48 గంటల బందుకు సంపూర్ణ సహకారం ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ శుక్రవారం చెప్పారు. అసమర్థ నాయకుల వల్లనే దేశానికి ఇలాంటి గతి పట్టిందని మండిపడ్డారు. నేడు ఎపిఎన్జీవోలు 24 గంటలు, టిడిపి 48 గంటలు, విద్యార్థి ఐకాస నిరవధిక, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒకరోజు బందుకు పిలుపునిచ్చింది.

సోనియాకు రూచి చూపించాలి: పయ్యావుల

సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు తమ మద్దతును యూపిఏ ప్రభుత్వానికి ఉపసంహరించుకుంటున్నట్లుగా రాష్ట్రపతికి, సభాపతికి లేఖలు ఇవ్వాలని టిడిపి నేత పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.

యూపిఏకు మద్దతు ఉపసంహరిస్తే కేంద్రం అవిశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని, అప్పుడు తెలంగాణ ప్రక్రియ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. తెలుగు వారితో పెట్టుకుంటే ఏ గతి పడుతుందో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి రూచి చూపించాలన్నారు.

సీమాంధ్రలో బంద్

విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సీమాంధ్రలో బంద్ కొనసాగుతోంది. ఎపిఎన్జీవోలు, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, విద్యార్థి ఐకాసలు బందుకు పిలుపునిచ్చాయి. కావూరి సహా కేంద్రమంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళంలో సోనియా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో పారామిలటరీ దళాలు మార్చ్ ఫాస్ట్ చేశాయి.

సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో విద్యాసంస్థలు, దుకాణాలు, వివిధ సంస్థలు, ఉద్యోగులు స్వచ్చంధంగా బందులో పాల్గొంటున్నారు. పలుచోట్ల ఆందోళన చేస్తున్న నాయకులను, సమైక్యవాదులను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద టిడిపి నేతలు, ఎపిఎన్జివోలు టైర్లు కాల్చి నిరసన తెలిపారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది.

English summary
Telugudesam Party senior leader and former MP Nandamuri Harikrishna on Friday supported 48 hours bandh called by TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X