విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏదడిగినా బాలకృష్ణ అంటున్నారు!: హరికృష్ణ అసహనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీరు పైన ఆ పార్టీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. తాను ఏ సీటు అడిగినా దానిని తన సోదరుడు, హీరో బాలకృష్ణకు ఇవ్వాలనుకుంటున్నారని హరి తన సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనకు పార్టీ సీటు కేటాయించకపోవడంపై హరికృష్ణ ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. తాను సీటు కోరలేదని చంద్రబాబు నాయుడు అవాస్తవాలు మాట్లాడుతున్నారని అంటున్నారట. పెనమలూరు స్థానాన్ని ఇవ్వాలని చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నప్పుడే అడిగానని చెబుతున్నారట.

Harikrishna unhappy with Chandrababu

అప్పుడు ఆ స్థానాన్ని బాలకృష్ణకు ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారన్నారు. అలాగే వీలైతే హిందూపురం శాసనసభ స్థానాన్ని కేటాయించాలని పొలిట్ బ్యూరో సమావేశంలో అడిగానని.. అప్పుడు కూడా హిందూపురంపై బాలకృష్ణ ఆసక్తి చూపుతున్నారని చెప్పారని చెబుతున్నారట.

సమైక్యాంధ్ర కోసం టిడిపి తరఫున పదవికి రాజీనామా చేసిన తనకు ఏదో ఒక సీటు కేటాయిస్తారని ఆశించానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కాగా విజయవాడ తూర్పు లేదా పెనమలూరు నియోజకవర్గాలకు హరికృష్ణ పేరు తాజాగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.

English summary
It is said that Telugudesam Party leader Nandamuri Harikrishna is unhappy with party chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X