వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేధించొద్దు, ముద్రగడని జైల్లో పెట్టండి: హర్ష, ఏపీని కేంద్రం ఆదుకోవాలి: కోడెల

|
Google Oneindia TeluguNews

అమలాపురం/విజయవాడ: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను ప్రభుత్వం తీవ్రంగా బాధిస్తోందని, ఆయనను బాధపెట్టేకన్నా అరెస్టు చేసి జల్లో పెట్టించినా బాగుండేదని ఆదివారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల హక్కుల కోసమే ముద్రగడ ఉద్యమిస్తున్నారన్నారు.

ముద్రగడ దగ్గరకు ఎవరినీ వెళ్లనీయకుండా ఆంక్షలు పెడుతోందన్నారు. ముద్రగడ పరిస్థితి జైల్లో కన్నా దారుణంగా ఉందన్నారు. చంద్రబాబు ఓ డిక్టేటర్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని, ఉద్యమాలను అణచి వేయాలని చూస్తున్నారన్నారు.

Harsha Kumar alleges government torchering Mudragada

చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. తుని విధ్వంసం ఘటనలో అమాయకులపై ప్రభుత్వం కేసులు పెట్టిందని ఆరోపించారు. కాపులు, దళితులను అణిచివేసే కుట్ర జరుగుతోందన్నారు. తుని దగ్ధం కేసులో ఓ దళితుడిని పోలీసులు అరెస్టు చేశారన్నారు. దీంతో, సీఐడీ విచారణలో డొల్లదనం బయటపడుతోందన్నారు.

కేంద్రం ఆదుకోవాలి: కోడెల

విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలని స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు కోరారు. కేంద్రంలో టిడిపి మిత్రపక్షంలో ఉన్నందున రాష్ట్రాన్ని అదుకోవాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాలా కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షాలు సహకరించాలని సూచించారు.

English summary
Former MP Harsha Kumar alleges that government torchering Mudragada Padmanabham.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X