వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గరపగర్రుకు వెళ్లి ఇలా చేస్తావా!: జగన్‌పై హర్ష కుమార్ తీవ్ర ఆగ్రహం

గరపగర్రు ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసిపి అధినేత వైయస్ జగన్‌లపై మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆదివారం నాడు నిప్పులు చెరిగారు.

|
Google Oneindia TeluguNews

రాజమహేంద్రవరం: గరపగర్రు ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసిపి అధినేత వైయస్ జగన్‌లపై మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆదివారం నాడు నిప్పులు చెరిగారు.

<strong>ఒకేరోజు పర్యటన: ఆశ్చర్యపరిచిన లోకేష్, బ్రాహ్మణి భావోద్వేగం</strong>ఒకేరోజు పర్యటన: ఆశ్చర్యపరిచిన లోకేష్, బ్రాహ్మణి భావోద్వేగం

గరుపగర్రు ఘటనను వైయస్ జగన్ ఖండించకపోవడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ గరపగర్రు పర్యటన పూర్తిగా నిరాశ పరిచిందన్నారు. జగన్ ఈ ఘటనను ఎందుకు ఖండించలేదని నిలదీశారు.

Harsha Kumar condemns YS Jagan's attitude in Garapagarru

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలిసే గరపగర్రు ఘటన జరిగిందని హర్షకుమార్ ఆరోపించారు. జూలై 6వ తేదీన చలో గరపగర్రును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనను నిరసిస్తూ సోమవారం ఏయూ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు.

ఇప్పటికైనా బాధితులకు న్యాయం చేయాలని హర్ష కుమార్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వంగలపూడి అనిత దళిత ద్రోహి అని, గరగపర్రు ఘటనపై అనిత ఎందుకు మాట్లాడడం లేదని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు.

హర్షకుమార్ ఆధ్వర్యంలో దళితులపై జరుగుతున్న దాడులపై ఏయూ ఎన్ఎస్ఎస్ హాల్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో హర్ష కుమార్, కొండ్రు మురళి, పలువురు వైసిపి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్ష కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
Former MP Harsha Kumar condemned YSR Congress Party chief YS Jagan's attitude in Garapagarru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X