అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీబీఐ విచారణ కోసం ఏపీ హైకోర్టుకు: దళిత యువకుడి మృతిపై డౌట్స్: కాంగ్రెస్ మాజీ ఎంపీ పిటీషన్

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రకాశం జిల్లా చీరాలలో దళిత యువకుడు కిరణ్ కుమార్ మృతి చెందిన ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మాజీ లోక్‌సభ సభ్యుడు జీవీ హర్షకుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఉదయం ఆయన హైకోర్టులో పిటీషన్‌ను దాఖలు చేశారు. హైకోర్టు ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం తన వాదనను వినిపించడానికి రెండు వారాల గడువు ఇచ్చింది. ఈ కేసును రెండు వారాల పాటు వాయిదా వేసింది.

డిక్లరేషన్ వివాదంలో వైసీపీ అండగా బీజేపీ నేత: సస్పెన్షన్‌లో ఉంటూ: ఆలయాలు ఏం బాగు పడ్డాయనిడిక్లరేషన్ వివాదంలో వైసీపీ అండగా బీజేపీ నేత: సస్పెన్షన్‌లో ఉంటూ: ఆలయాలు ఏం బాగు పడ్డాయని

చీరాలలోని థామస్ పేటకు చెందిన కిరణ్ కుమార్ జులైలో మరణించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ కుమార్, ఆయన స్నేహితుడు షైనాయ్‌ను మాస్కు లేకుండా తిరుగుతున్నారనే కారణంతో వారిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద కేసు నమోదు చేశారు చీరాల పోలీసులు. తమను అదుపులోకి తీసుకున్న సందర్భంగా పోలీసులు తీవ్రంగా కొట్టారంటూ కిరణ్ కుమార్, ఆయన స్నేహితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజే కిరణ్ కుమార్ మరణించారు. తీవ్రంగా గాయపడిన కిరణ్‌ కుమార్‌ను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు.

Harsha Kumar moves AP High Court, seeks CBI inquiry over Dalit youths death in Chirala

పోలీసులు కొట్టిన దెబ్బల వల్లే కిరణ్ కుమార్ మరణించారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు చెలరేగాయి. తాజాగా- కిరణ్ కుమార్ మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని, ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ జీవీ హర్షకుమార్ హైకోర్టును ఆవ్రయించారు. హర్షకుమార్ తరఫున ప్రముఖ న్యాయవాది శ్రావణ్ కుమార్ ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు. విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Recommended Video

AP Police Seva App Launch | అన్ని నేరాలపై ఆన్ లైన్ లోనే ఫిర్యాదు, దేశంలోనే తొలిసారి!!

సీబీఐ దర్యాప్తునకు అప్పగించడానికి అవసరమైన అన్ని అర్హతలు ఈ కేసుకు ఉన్నాయని న్యాయమూర్తులు వ్యాఖ్యానించినట్లు సమాచారం. కిరణ్ కుమార్ మరణంపై పోలీసులు నిర్వహించిన విచారణ పట్ల ఆయన కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారని, ఈ పిటీషన్ దాఖలు చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాది వినిపించిన వాదనలతో న్యాయమూర్తులు ఏకీభవించలేదు. ప్రభుత్వం తరఫున వాదనలను వినిపించడానికి రెండు వారాల పాటు గడువు ఇచ్చింది. అనంతరం ఈ కేసుపై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

English summary
Former MP GV Harsha Kumar has filed a public interest litigation in the Andhra Pradesh High Court seeking handing over the case of the death of SC youth Kiran Kumar in Chirala of Prakasam district to the CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X