వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్షకుమార్‌కు 14 రోజుల రిమాండ్: సెంట్రల్ జైలుకు తరలింపు

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు దిగడంతోపాటు గాల్లోకి కాల్పులు జరిపి కలకలం రేపిన మాజీ ఎంపీ హర్ష‌కుమార్‌కు రాజమండ్రి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

ఆదివారం జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో హర్షకుమార్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించారు. తన దీక్షను భగ్నం చేసేందుకు యత్నించిన పోలీసులను హర్షకుమార్ అడ్డుకున్నారు.

Harsha Kumar remanded for 14 days

తనను బలవంతంగా ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి.. తన రివాల్వర్‌తో గాల్లోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కూడా దీక్ష కొనసాగించిన హర్షకుమార్.. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు.

అనంతరం రాజమండ్రి మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన లొంగిపోయారు. గాల్లోకి కాల్పులు జరిపిన హర్షకుమార్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, కోర్టులో హాజరుపర్చారు. కాగా, హర్ష కుమార్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు హర్షకుమార్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

English summary
Former MP Harsha Kumar remanded for 14 days, and sent to central jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X