అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మనవాడే కదా అని మీ వాహనం వేరే వాళ్లకి ఇస్తే...ఏం జరుగుతుందో తెలుసా?:10 ఏళ్లు జైలుశిక్ష పడే అవకాశం

|
Google Oneindia TeluguNews

అమరావతి:ఫ్రెండ్ అడిగాడు కదా అని ఒక వ్యక్తి తన బైక్ ను తన స్నేహితుడికి ఇచ్చాడు. అతడు దాన్ని నడుపుతూ ప్రమాదవశాత్తూ మరో వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. తన స్నేహితుడి వద్ద బైక్ తీసుకొని నడుపుతూ యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి లైసెన్స్‌ కూడా లేదు.

దీంతో పోలీసులు ఏం చేశారో తెలుసా?...ప్రమాదానికి కారణమైన ఆ వ్యక్తితో పాటుగా అతడికి ఆ బైక్ ను ఇచ్చిన వాహన యజమానిపై కూడా ఒక సెక్షన్ కింద కేసు పెట్టారు. ఆ సెక్షన్ కింద నేరం రుజువైతే పడే శిక్ష ఎంతో తెలుసా దాదాపు పదేళ్లు. ఆ సెక్షన్ 304(బి)...ఇప్పుడు ఈ సెక్షనే వాహనదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇది బైక్ కే కాదు కారు లేదా ఏ వాహనానికైనా ఇదే రూల్ వర్తిస్తుంది. అంతమాత్రమే కాదు...దీని గురించి తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇంకా ఉన్నాయి.

తెలంగాణలో పోలీస్ వాహనం చోరీ: ఏపీలో దొరికాడు తెలంగాణలో పోలీస్ వాహనం చోరీ: ఏపీలో దొరికాడు

 మరో ఉదాహరణ...చూద్దాం

మరో ఉదాహరణ...చూద్దాం

ఒక వ్యక్తి తన భార్య పేరుతో కారును కొనుగోలు చేశాడు. కొంతకాలం వాడిన తరువాత మరో మోడల్ కొనుగోలు కోసం ఈ కారును వేరే వ్యక్తికి అమ్మేశాడు. అయితే ఆ కారును కొనుగోలు చేసిన వ్యక్తి నిర్లక్ష్యంతో దానిని తన పేరు మీదకు మార్పించుకోకుండా వదిలేశాడు. ఆ తరువాత కొన్నాళ్లకు ఇదే కారుతో ఓ పాదచారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అవతలి వ్యక్తి దుర్మరణం పాలవగా ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ట్విస్ట్ ఏమిటంటే ఈ ఘటనలో కారు నడిపిన వ్యక్తితో పాటుగా...ఆ కారు ఎవరి పేరు మీదైతే ఉందో వారి పై కూడా పోలీసులు 304(బి) సెక్షన్‌ కింద కేసు నమోదుచేశారు. దీంతో తమకు ఏ సంబంధం లేకపోయినా కేసులో ఇరుక్కోవడంపై సదరు మహిళ, ఆమె భర్త లబోదిబోమన్నారు.

ఇప్పుడు.. 304(బి) సెక్షన్‌ చూద్దాం

ఇప్పుడు.. 304(బి) సెక్షన్‌ చూద్దాం

దీంతో 304(బి) సెక్షన్‌ అనేది ఇప్పుడు వాహనదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవరుపై మాత్రం 304(ఏ) సెక్షన్‌ కింద కేసు నమోదు చేసేవారు. ఆ తరువాత డ్రైవర్ నేరం రుజువైతే ప్రమాదానికి కారకుడైనందుకు రెండేళ్ల జైలు శిక్ష పడేది. అయితే ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా పెరగడంతో ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ప్రమాదాల నివారణకు గాను చట్టంలో సవరణ తీసుకొచ్చింది. ఆ సవరణలో భాగంగానే 304(బి) సెక్షన్‌ అమల్లోకి వచ్చింది.

దాదాపు...పదేళ్లు జైలుశిక్ష

దాదాపు...పదేళ్లు జైలుశిక్ష

లైసెన్సు లేకుండా వాహనాన్ని నడిపి ఇతరుల ప్రాణాలు పోవడానికి కారణమైనా, అలాగే నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి ఇతరులను ఢీకొట్టి వారి ప్రాణాలు పోవడానికి కారణమైనా...ఈ సందర్భాల్లో ఆయా కేసులను దాదాపుగా హత్య కేసుతో సమానంగా ఉండేలా నూతనంగా ఈ 304(బి) సెక్షన్‌ ను అమల్లోకి తెచ్చారు. తద్వారా గతంలో ఉన్న 304(ఏ) సెక్షన్‌ ప్రకారం ప్రమాదానికి కారణమైన డ్రైవరుకు రెండేళ్లు జైలుశిక్ష పడితే, ఇప్పుడు దాదాపు పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశముంది. అంతేకాక డ్రైవర్‌తో పాటుగా వాహన యజమానిపై కూడా ఈ కేసును నమోదు చేస్తున్నారు. దీంతో వీరికి ఈ శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు అరెస్టు అయిన వెంటనే ఈ కేసులో బెయిల్‌ కూడా లభించే అవకాశాలు ఉండవు. ఈ విషయం తెలిసిన వాహనదారులు భీతిల్లుతుండగా తెలియని వారు ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.

 అందుకే...తస్మాత్ జాగ్రత్త!

అందుకే...తస్మాత్ జాగ్రత్త!

ఈ 304(బి) సెక్షన్ అమల్లోకి వచ్చినందున లైసెన్సు లేని వారికి,స్నేహితులకు,చిన్నారులకు వాహనాలను ఇస్తే లేనిపోని కేసుల్లో ఇరుక్కునే అవకాశాలున్నాయని పోలీసులు వాహనదారులను హెచ్చరిస్తున్నారు. ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాలను తీసుకుంటోందని పోలీసులు అంటున్నారు.
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కేసును పరిగణనలోకి తీసుకుంటారని...ఆ ప్రకారమే వాహనాన్ని సీజ్‌ చేస్తారని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. తదుపరి దర్యాప్తు మొత్తం పోలీసుల మీదే ఆధారపడి ఉంటుందని...ఏదేమైనా 304(బి) సెక్షన్‌ ప్రకారం ఒకరి వాహనం మరొకరు తీసుకువెళ్లి యాక్సిడెంట్ చేస్తే ఇబ్బందులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.

 వాహనదారుల...ఆగ్రహం

వాహనదారుల...ఆగ్రహం

అయితే ఈ నూతన చట్ట సవరణ, 304(బి) సెక్షన్ పై అధికారుల హెచ్చరికల విషయమై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు...పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా రోడ్డు వెడల్పు, పార్కింగు వంటి సదుపాయాలు,సరైన పర్యవేక్షణ లేకుండా ఈ చట్టాల్లో సవరణలు,కఠిన శిక్షలు సరికాదని వాహనదారులు అంటున్నారు. ఇటువంటి చట్టాల్లో సవరణలు చేసే ముందు ప్రజలను సంప్రదించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వాహనదారులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ సెక్షన్ అమల్లోకి వచ్చినందున దీనిపై అవగాహన లేని వాహనదారులు ఇక్కట్లలో పడడం ఖాయం కాబట్టి పోలీసులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

English summary
Section 304 (b)...Now this section is raising heart beat in the hearts of the vehicle owners. The reason is that motorists who are not aware of this law are likely to get major jail sentences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X