వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్మగడ్డ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశం- స్ధానిక ఎన్నికలకు సహకరించాలని జగన్‌కు సూచన..

|
Google Oneindia TeluguNews

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలకు జగన్‌ ప్రభుత్వం సహకరించడం లేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. స్ధానిక ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘానికి సహకరించాలని ప్రభుత్వానికి సూచించింది.

సీఎం వైఎస్ జగన్ క్రిస్టియనా? ఎలా చెబుతారు? ఆధారాలేవి?: పిటిషనర్‌కు హైకోర్టు ప్రశ్నసీఎం వైఎస్ జగన్ క్రిస్టియనా? ఎలా చెబుతారు? ఆధారాలేవి?: పిటిషనర్‌కు హైకోర్టు ప్రశ్న

ఏపీలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు అందడం లేదని, సహకారం కూడా లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. నిమ్మగడ్డ పిటిషన్‌పై ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అయితే ఎన్నికల సంఘం తమను సంప్రదించలేదంటూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు... రాజ్యాంగ సంస్ధ ప్రతీ అంశంలో ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించింది. అలాగే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలో చెప్పాలని ఎస్‌ఈసీని కూడా అడిగింది.

 hc advice jagan government to cooperate election commission for local body elections

Recommended Video

Nimmagadda Ramesh Kumar Case Coming To Hearing On June 10 In Supreme Court

పిటిషన్‌లో వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం... దీనిపై ప్రత్యేకంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. స్ధానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల సంఘానికి సహకరించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఇప్పటికే కరోనా కారణంగా ఈ ఏడాది మార్చిలో వాయిదా పడిన స్ధానిక ఎన్నికలను త్వరలో నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే ఎన్నికల విషయంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ముందుకెళ్లే అవకాశముంది.

English summary
andhra pradesh high court on wednesday advised jagan government to cooperate state election commission to conduct local body elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X