వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్మగడ్డకు సహాయనిరాకరణ- హైకోర్టు సీరియస్‌- ప్రస్తుత, గత సీఎస్‌లకు నోటీసులు

|
Google Oneindia TeluguNews

ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో గతంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండిపోవడమే కాకుండా అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చివరికి సుప్రీంకోర్టులోనూ సర్కారుకు ఎదురుదెబ్బ తప్పలేదు. అయితే ఇందులో ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం కలిగినా కలగకపోయినా అధికారులకు మాత్రం సమస్యలు తప్పడం లేదు. ప్రభుత్వ ఆదేశాలను పాటించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కు సహకరించని ప్రస్తుత, గత ఛీఫ్ సెక్రటరీలతో పాటు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శికీ హైకోర్టు ఇప్పుడు ధిక్కార నోటీసులు జారీ చేసింది.

నిమ్మగడ్డకు తొలి సక్సెస్‌-పంచాయతీల్లో లక్ష నామినేషన్లు-పనిచేయని ఏకగ్రీవాల ఆఫర్‌నిమ్మగడ్డకు తొలి సక్సెస్‌-పంచాయతీల్లో లక్ష నామినేషన్లు-పనిచేయని ఏకగ్రీవాల ఆఫర్‌

 నిమ్మగడ్డకు సహాయనిరాకరణ

నిమ్మగడ్డకు సహాయనిరాకరణ

ఏఫీలో ఎస్ఈసీ నిమ్మగ్డడ రమేష్‌ హయాంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ముందునుంచీ ఆసక్తిగా లేదని వైసీపీ ప్రభుత్వం ఆయనకు అడుగడుగునా ఆటంకాలు కల్పించింది. ఎన్నికల నిర్వహణను చివరి వరకూ అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఇదే క్రమంలో హైకోర్టు ఎన్నికలు నిర్వహించాల్సిదేనంటూ ఇచ్చిన తీర్పును ధిక్కరించేందుకూ ప్రభుత్వం సిద్ధమైంది. బిజినెస్‌ రూల్స్‌ను కూడా ధిక్కరించి అధికారులు నిమ్మగడ్డకు సహాయనిరాకరణ చేశారు. హైకోర్టు తీర్పుకు ధిక్కారం అవుతుందని తెలిసి కూడా ప్రభుత్వ ఆదేశాలను పాటించారు. దీంతో ఇప్పుడు వారందరికీ చుక్కలు కనిపిస్తున్నాయి.

 హైకోర్టులో నిమ్మగడ్డ ధిక్కార పిటిషన్‌

హైకోర్టులో నిమ్మగడ్డ ధిక్కార పిటిషన్‌

పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్‌ఈసీకి పూర్తి సహాయ సహకారాలు అందించాలని గతేడాది నవంబర్‌ 3న హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వీటిని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ తర్వాత సింగిల్‌ బెంచ్‌లో అప్పీలు చేసింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పు అనుకూలంగా వచ్చినా డివిజన్‌ బెంచ్‌ దాన్ని కొట్టేసింది. దీంతో నవంబర్‌ 3న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదంటూ డిసెంబర్‌ 18న ఎస్‌ఈసీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమకు సహకరించడం లేదని ఎస్ఈసీ హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.

 నిమ్మగడ్డ పిటిషన్ విచారణ 42 రోజుల ఆలస్యం

నిమ్మగడ్డ పిటిషన్ విచారణ 42 రోజుల ఆలస్యం

అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ డిసెంబర్‌ 18న ఎస్ఈసీ నిమ్మగడ్డ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ నిన్నటివరకూ హైకోర్టులో విచారణకు రాలేదు. 42 రోజుల తర్వాత కోర్టు ముందుకు వచ్చిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించింది. డిసెంబర్‌ 18న దాఖలైన పిటిషన్‌ మరుసటి రోజు మీడియాలో వస్తే సరిపోతుందని భావించారా అని ఎస్ఈసీ న్యాయవాదిని సైతం ప్రశ్నించింది. చివరికి ఈ ఘటనకు బాధ్యులెవరో తేల్చాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు ఇచ్చింది.

Recommended Video

Rajahmundry లో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం!!
కోర్టు ధిక్కారంపై నీలం, దాస్‌, ద్వివేదీకి నోటీసులు

కోర్టు ధిక్కారంపై నీలం, దాస్‌, ద్వివేదీకి నోటీసులు


పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీకి సహకరించాలని తాము ఇచ్చిన ఆదేశాలను సీఎస్‌లు, ఇతర అధికారులు పాటించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో బాధ్యతగా గతంలో పిటిషన్‌లో ప్రతివాదిగా పేర్కొన్న మాజీ సీఎస్‌ నీలం సాహ్నీతో పాటు తాజాగా ప్రతివాదిగా చేరిన ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆధేశాల ధిక్కారంపై స్ధాయీ నివేదిక ఇవ్వకపోతే తదుపరి విచారణకు రావాల్సి ఉంటుందని మాజీ సీఎస్‌ నీలం సాహ్నీకి హైకోర్టు హెచ్చరికలు కూడా చేసింది.

English summary
andhra pradesh high court issues notices to chief secretary adityanath das and his former one neelam sawhney in state election commissioner nimmagadda ramesh kumar's contempt case regarding gram panchayat elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X