వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ సర్కారుకు మరో ఝలక్‌- మిషన్‌ బిల్డ్‌ ఏపీ కేసు- ఐఏఎస్‌ ప్రవీణ్‌పై కోర్టు ధిక్కారం

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఆర్ధిక వనరుల కోసం ప్రభుత్వ భూములను విక్రయించేందుకు ఉద్దేశించిన మిషన్ బిల్డ్‌ ఏపీ పథకానికి సంబంధించిన కేసుల్లో విచారణపై హైకోర్టు ఇవాళ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ అనని వ్యాఖ్యలని కోట్‌ చేస్తూ ఆయన్ని తప్పించాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. అంతటితో ఆగకుండా ప్రభుత్వం తరఫున తప్పుడు ఆరోపణలతో ఈ పిటిషన్‌ దాఖలు చేసిన ఐఏఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై కోర్టు ధిక్కార చర్యలకు ఆదేశాలు ఇచ్చింది.

జగన్‌ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ...

జగన్‌ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ...

మిషన్‌ బిల్డ్‌ ఏపీపై దాఖలైన పిటిషన్ల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ను తప్పుకోవాలని కోరుతూ ఏపీ సర్కార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇవాళ కొట్టేసింది. జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ తనపై ఈ పిటిషన్లో ప్రభుత్వం చేసిన ఆరోపణలపై విచారణ జరిపారు. ఈ ఆరోపణలను నిరూపించడంలో ప్రభుత్వ న్యాయవాది విఫలం కావడంతో ఈ పిటిషన్‌ను కొట్టేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు పిటిషన్లో పేర్కొన్న ఆరోపణలు చేసిన వారిపైనా హైకోర్టు సీరియస్‌ అయింది.

ఐఏఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై కోర్టు ధిక్కారం

ఐఏఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై కోర్టు ధిక్కారం

గతంలో మిషన్‌ బిల్డ్‌ ఏపీ కేసుల విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ ఏపీలో రాజ్యాంగం విచ్ఛిన్నమైందని వ్యాఖ్యానించినట్లు పేర్కొంటూ ఆయన్ను తప్పించాలని ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. దీన్ని విచారించిన హైకోర్టు న్యాయమూర్తి రాకేష్‌ కుమార్‌... తాను అనని మాటల్ని అన్నట్లు వక్రీకరించి ఈ పిటిషన్‌ దాఖలు చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. తప్పుడు ఆరోపణలతో వేసిన పిటిషన్‌ను కొట్టేయడమే కాకుండా ఈ పిటిషన్‌ వేసిన ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌పై కోర్టు ధిక్కార ర్యలకు ఆదేశాలు ఇచ్చారు.
క్రిమినల్‌ ప్రాసిక్యూషన్ కింద కేసు దాఖలుకు రిజిస్ట్రార్‌ జనరల్‌కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

అసలేం జరిగిందంటే...

అసలేం జరిగిందంటే...

మిషన్‌ బిల్డ్ ఏపీ కేసుల విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి రాకేష్‌ కుమార్‌ అనని వ్యాఖ్యలను అన్నారంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు మీడియాలో వచ్చిన కథనాలే ఆధారంగా పేర్కొంది. చివరికి వాటిని సమర్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైంది.
అసలు ఈ వ్యాఖ్యలు ఎవరు చేశారని జస్టిస్‌ రాకేష్‌ ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది వద్ద సమాధానం లేకుండా పోయింది. మీడియాలో వచ్చిందని చెప్పారు. కానీ మీడియాలో క్లిప్పింగ్స్‌ను కూడా సమర్పించలేకపోయారు. దీంతో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రిజిస్టార్‌ను ఆదేశించింది. న్యాయప్రక్రియలో జోక్యం చేసుకోవడం వల్లే ఈ పరిస్ధితి తలెత్తిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

English summary
andhra pradesh high court on wednesday orders contempt proceedings against ias praveen kumar for giving misinformation to the court in mission build ap case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X