వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా పరిధిలో లేదు: మల్కాన్‌గిరి ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు విచారణ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో దాఖలైన పిల్‌పై బుధవారం విచారణ జరిగింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వ్యాజ్యంపై తదుపరి విచారణను నవంబర్‌ రెండో తేదీకి వాయిదా వేసింది. ఎన్‌కౌంటర్‌ ఒడిశా పరిధిలో జరిగిందని ఆంధ్రప్రదేశ్‌ అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు నివేదించారు. ఈ మేరకు ఒడిశాలో ఎన్‌కౌంటర్ జరిగినందున తమ పరిధిలోకి రాదని హైకోర్టు పేర్కొంది.

HC puts off hearing of PIL on Malkangiri encounter to Wednesday

ఎదురుకాల్పుల ఘటనపై పూర్తి సమాచారం ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మృతి చెందిన మావోల మృతదేహాలను విశాఖ తరలించాలని కోరుతూ పిటిషనర్ ఈ మేరకు కోర్టును కోరారు. కాగా, ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని పిటిషనర్ తరపు న్యాయవాది ఆరోపించారు.

ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 24 మంది, మంగళవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.

English summary
High Court (HC) today has put off the hearing of Public Interest Litigation (PIL) on Malkangiri encounter to Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X