• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రఘురామపై హైకోర్టు ఫైర్ -సీబీఐ కోర్టు తీర్పులపై అనుమానాలు- సాక్షి, సాయిరెడ్డి ఉదంతాలు

|

ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన కేసుల్లో సీబీఐ కోర్టు ఇవాళ కీలక తీర్పులు వెలువరించబోతోంది. అయితే ఈ తీర్పుల్ని అడ్డుకోవాలని కోరుతూ పిటిషనర్ అయిన రఘురామకృష్ణంరాజు ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రఘురామకృష్ణంరాజు అభ్యంతరాలు విన్న హైకోర్టు... ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా సీబీఐ కోర్టు తీర్పుల్ని అనుమానించడంపై హైకోర్టు సీరియస్ అయింది. దీంతో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

 జగన్, సాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లు

జగన్, సాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లు

వైఎస్ జగన్, విజయసాయిరెడ్డికి అక్రమాస్తుల కేసులో గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ప్రతివాదులైన జగన్, సాయిరెడ్డితో పాటు దర్యాప్తు సంస్ధ అయిన సీబీఐ కూడా కౌంటర్లు ఇచ్చింది. అయితే సీబీఐ ఇచ్చిన మెమోలో తన వాదన వినిపించకుండా కోర్టునే తుది నిర్ణయం తీసుకోవాలని కోరింది. దీంతో రఘురామ దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన సీబీఐ కోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించేందుకు సిద్దమవుతోంది. వాస్తవానికి గత నెల 23నే వెలువడాల్సిన ఈ తీర్పు కాస్తా పలు కారణాలతో ఇవాళ్టికి వాయిదా పడింది. దీంతో ఇవాళ వెలువడే తీర్పు జగన్, సాయిరెడ్డిల భవితవ్యాన్ని తేల్చబోతోంది. అధే సమయంలో పిటిషనర్ అయిన రఘురామకృష్ణంరాజుకూ ఇది కీలకంగా మారింది.

సీబీఐ కోర్టు తీర్పు నేడే

సీబీఐ కోర్టు తీర్పు నేడే

జగన్,సాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపై హైదరాబాద్ సీబీఐ కోర్టు ఇవాళ తుది తీర్పు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ఈ రెండు పిటిషన్లపై ఇప్పటికే సీబీఐతో పాటు ప్రతివాదులైన జగన్, సాయిరెడ్డి అఫిడవిట్లు కూడా తీసుకున్న సీబీఐ కోర్టు తుది తీర్పు ఇవ్వబోతోంది. గతంలో అక్రమాస్తుల కేసులో జగన్, సాయిరెడ్డికి ఇచ్చిన బెయిల్ నిబంధనలు వీరు ఉల్లంఘించారా లేదా అన్న దానిపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు... ఈ తీర్పులు ఇచ్చేందుకు సిద్ధమైంది. రఘురామ వీరిద్దరూ సీబీఐ కోర్టు బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని గట్టిగా వాదించారు. అయితే రఘురామ రాజకీయ కారణాలతోనే తమను టార్గెట్ చేస్తున్నారని వీరిద్దరూ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు జగన్ సీఎంగా ఉండటం, విజయసాయిరెడ్డి వైసీపీలో కీలక నేతగా ఉండటంతో ఈ తీర్పులు వైసీపీకి చాలా కీలకంగా మారాయి. అదే సమయంలో ఈ తీర్పులు వెలువడకముందే వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషనర్ అయిన రఘురామకృష్ణంరాజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

 రఘురామ పిటిషన్ పై హైకోర్టు విచారణ

రఘురామ పిటిషన్ పై హైకోర్టు విచారణ

జగన్, సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ తీర్పు రాబోతున్న వేళ రఘురామరాజు ట్విస్ట్ ఇచ్చారు. ఆ తీర్పు ఏంటో తెలుసుకోకుండానే దాని చుట్టూ చోటు చేసుకుంటున్న పరిణామాల్ని గుర్తు చేస్తూ ఈ తీర్పుల్ని ఆపాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కోర్టు వైఖరిపై రఘురామ పలు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. దీంతో రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ పై నిన్న మధ్యాహ్నం విచారణ జరిపిన హైకోర్టు... తీర్పును ఇవాళ్టికి రిజర్వ్ చేసింది. అయితే అదే సమయంలో రఘురామకృష్ణంరాజు తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

 రఘురామపై హైకోర్టు ఆగ్రహం

రఘురామపై హైకోర్టు ఆగ్రహం

జగన్, సాయిరెడ్డి బెయిళ్ల రద్దుపై తాను చేసిన పిటిషన్లు విచారించిన సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చే వేళ రఘురామరాజు దాన్ని ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేయడంపై తెలంగాణ హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అదే సమయంలో ఇందుకు ఆయన వ్యక్తం చేసిన అనుమానాల్ని కూడా తప్పుబట్టింది. దీంతో పాటు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చివరి నిమిషంలో వచ్చి సీబీఐ కోర్టు తీర్పులు ఆపాలని కోరడం వెనుక ఏముందనే అంశంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. అయితే అదే సమయంలో హైకోర్టు తన తీర్పును కూడా ఇవాళ ఇవ్వబోతోంది. దీంతో రఘురామరాజు కోరుతున్న విధంగా హైకోర్టు.. సీబీఐ కోర్టు తీర్పుల్ని ఆపుతుందా లేదా అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

 సీబీఐ కోర్టునే అనుమానిస్తారా ?

సీబీఐ కోర్టునే అనుమానిస్తారా ?

జగన్, సాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపై సీబీఐ కోర్టు ఇచ్చే తీర్పుల్ని ఆపాలని రఘురామ కోరడం వెనుక ఆయన కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో సదరు అనుమానాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ కోర్టునే అనుమానిస్తారా అంటూ రఘురామ న్యాయవాదిపై ఫైర్ అయింది. పరిస్ధితులకు అనుగుణంగా కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయని, దీనికే న్యాయస్ధానాలపై అనుమానాలు వ్యక్తం చేస్తారా అని రఘురామను ప్రశ్నించింది. దీంతో ఇప్పుడు సీబీఐ కోర్టుపై రఘురామ అనుమానాల వెనుక ఉన్న కారణాలపై చర్చ జరుగుతోంది.

  Telangana కళాకారులకు ఏంతక్కువ.. MAA ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న సీవీఎల్
   రఘురామ అనుమానాలివే..

  రఘురామ అనుమానాలివే..

  ఇవాళ వెలువడాల్సిన జగన్,సాయిరెడ్డి బెయిల్స్ రద్దు పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పులు ఆపాలని రఘురామకృష్ణంరాజు కోరడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా గత విచారణ సందర్భంగా సీబీఐ కోర్టు తాను దాఖలుి చేసిన జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టేయకపోయినా కొట్టేసినట్లు సాక్షి మీడియా ఇంటర్నెట్ లో బ్రేకింగ్ న్యూస్ పెట్టింది. దీంతో పాటు తాజాగా మరో నిందితుడు విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లకుండా గతంలో పెట్టిన ఆంక్షల్ని సడలిస్తూ సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ రెండు అంశాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు దీనిపై తీవ్రంగా స్పందించింది.

  English summary
  telangana high court has made serious comments on ysrcp rebel mp and also petitioner in ys jagan and vijaya sai reddy bail cancellation cases for his doubts over cbi court verdicts.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X