• search

కుమారస్వామి పెళ్లి సంబంధంకోసం రాలేదా? ఆంధ్రా అమ్మాయితో నిఖిల్ పెళ్లిపై జోరుగా..

By Srinivas
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
      ఆంధ్రా అమ్మాయితో నిఖిల్ పెళ్లిపై జోరుగా సాగుతున్న ప్రచారం...!

      విజయవాడ: తన కుమారుడు నిఖిల్ గౌడకు ప్రాఫిట్ కంపెనీ అధినేత కోటేశ్వర రావు కూమార్తెతో పెళ్లి సంబంధం కుదుర్చుకునేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విజయవాడకు వచ్చారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే దీనిపై సదరు ప్రాఫిట్ కంపెనీ అధినేత స్పందించారు.

      కుమారస్వామి దంపతులు విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న అనంతరం కోటేశ్వర రావు నివాసానికి వెళ్లారు. దీనిపై కోటేశ్వర రావు మాట్లాడారు. పెళ్లి సంబంధం కోసం కుమరస్వామి తమ ఇంటికి రాలేదన్నారు. ఆయన తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని, అందుకే విజయవాడకు వచ్చిన ఆయనను భోజనానికి పిలిచామన్నారు.

      ప్రాఫిట్ కంపెనీ షూ అధినేత ఏం చెప్పారంటే?

      ప్రాఫిట్ కంపెనీ షూ అధినేత ఏం చెప్పారంటే?

      కుమారస్వామి కుటుంబంతో తమకు ఎప్పటి నుంచో మంచి పరిచయం ఉందని కోటేశ్వర రావు తెలిపారు. ఆ అనుబంధంతోనే ఇంటికి ఆహ్వానించామని తెలిపారు. కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ, ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత కూతురు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారని, పరిచయం ఉందని ప్రచారం కూడా సాగుతోంది. అందుకే ఇరు కుటుంబాలు పెళ్లి జరిపించాలని భావిస్తున్నారని అంటున్నారు. దాని కోసం కుమారస్వామి వచ్చారని ప్రచారం జరిగింది. కానీ దీనిని కోటేశ్వర రావు కొట్టిపారేశారు.

      దేవేగౌడ అలా చెప్పారని ప్రచారం

      దేవేగౌడ అలా చెప్పారని ప్రచారం

      శుక్రవారం బెంగళూరులోని పద్మనాభనగర్‌లో మాజీ ప్రధాని దేవేగౌడ నివాసానికి బ్రిటీష్ హైకమిషనర్ డోనాల్డ్ మైక్ అలిస్టర్ వచ్చారు. ఈ సందర్భంగా దేవేగౌడ మాట్లాడుతూ.. కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం విషయంపై అలిస్టర్ తనతో చర్చించారని చెప్పారు. అదే సమయంలో తన తనయుడు, సీఎం కుమారస్వామి, ఆయన సతీమణి అనితా కుమారస్వామి ఏపీలోని విజయవాడకు వెళ్లరని చెప్పారు.

      దేవేగౌడ చెప్పారు

      దేవేగౌడ చెప్పారు

      ఎందుకు వెళ్లారని మీడియా ప్రశ్నించగా... కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడకు అమ్మాయిని చూసేందుకు వెళ్లారని దేవేగౌడ సమాధానం ఇవ్వడంతో పాటు అందరికీ ఇష్టమైతే పెళ్లి జరిపిస్తామని, ఇది వ్యక్తిగత విషయమని, తాను ఎక్కువగా మాట్లాడనని అన్నారు.

      ఆయన మాత్రం ఇలా

      ఆయన మాత్రం ఇలా

      ఓ వైపు దేవేగౌడ అమ్మాయిని చూసేందుకు విజయవాడ వెళ్లారని చెప్పగా, అదే సమయంలో దేవేగౌడ, ఆయన సతీమణి అనిత ఇక్కడకు వచ్చారు. మరోవైపు ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత మాత్రం మరో విధంగా చెప్పారు. కుమారస్వామి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు. కోటేశ్వర రావు నివాసంలో కుమారస్వామి దంపతులతో పాటు లగడపాటి రాజగోపాల్, రఘురామ కృష్ణం రాజులు కూడా లంచ్ చేశారు.

      మాస్టర్ డిగ్రీ చేశారు

      మాస్టర్ డిగ్రీ చేశారు

      కోటేశ్వర రావు కూతురు పేరు సహజ. ఆమె యూకేలోని వార్‌విక్ యూనివర్సిటీలో లాజిస్టిక్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. ప్రస్తుతం ఆమె ప్రాఫిట్ షూ కంపెనీ కార్యకలాపాలు చూసుకుంటున్నారు. మొత్తానికి కుమారస్వామి విజయవాడ పర్యటన నేపథ్యంలో పెళ్లి అంశంపై జోరుగా ప్రచారం సాగుతోంది.

      తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

      English summary
      Koteswara Rao issued a statement to media that there was no truth in the speculation that the Kumaraswamys had come to discuss an alliance. “He is our family friend. Since the couple came to Vijayawada, we invited them for lunch,” he said.

      Oneindia బ్రేకింగ్ న్యూస్
      రోజంతా తాజా వార్తలను పొందండి

      X
      We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more