వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందు అమ్ముతాం :సేల్స్ మెన్ ఉద్యోగాల కోసం పీజీ విద్యార్ధులు బారులు: ఎమ్మెల్యేలకు గిరాకీ..!!

|
Google Oneindia TeluguNews

మద్యం అమ్మేందుకు పట్టభద్రులు..పోస్టు గ్రాడ్యుయేట్లు పోటీ పడుతున్నారు. అక్టోబర్ నుండి ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణలో మద్యం దుకాణాలను నిర్వహించనుంది. ఇందుకోసం సేల్స్ మెన్ .. సూపర్ వైజర్లు నియామకం ప్రారంభించింది. ఈ పోస్టుల కోసం అభ్యర్ధులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసారు. ఉన్నత విద్యా వంతులు సైతం ఈ పోస్టులు దక్కించుకోవటానికి పోటీ పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తెస్తున్నారు. సచివాయల పోస్టుల పరీక్షలు పూర్తయ్యాయి. ప్రశ్నా పత్రాలు కఠినంగా ఉన్నాయని చెబుతున్న అభ్యర్దులు ఇప్పుడు మందు అమ్మటానికి సైతం ముందుకు వచ్చారు. దీంతో.. ఇప్పుడు ఏపీలో సచివాలయ పోస్టులకే కాదు..మద్యం అమ్మకాల పోస్టులకు డిమాండ్ పెరిగింది.

మద్యం అమ్మేందుకు నిరుద్యోగుల పోటీ..
మద్యం అమ్మకాల పోస్టుల్లో దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువగా పట్టభద్రులు..పోస్టు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల్లో సూపర్‌ వైజర్‌, సేల్స్‌మెన్‌ పోస్టుల భర్తీ కోసం గత నెలలో ఎక్సైజ్‌ శాఖ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు దారులకు ఎక్సైజ్ శాఖ సర్టిఫికెట్లు పరిశీలన చేసింది. అందులో అభ్యర్ధుల విద్యార్హతలు చూసి అధికారులు నివ్వెర పోయారు. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత సచివాలయ ఉద్యోగాలతో పాటుగా ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల నిర్వహణలో పోస్టుల కోసం ప్రకటన విడుదల చేసింది. సచివాలయ పోస్టులకు దాదాపు 21 లక్షల మంది పోటీ పడ్డారు. అయితే పరీక్షల నిర్వహణలో భాగంగా ప్రశ్నాపత్రాలు చాలా కష్టంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అయింది. అదే విధంగా ఎటువంటి సిఫార్సులకు..అవినీతికి ఆస్కారం లేకుండా సెక్రటేరియట్ పోస్టుల నిర్వహణ కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 20న ప్రభుత్వం సచివాలయ పరీక్షల ఫలితాలను విడుదల చేయనుంది. దీంతో..ప్రభుత్వం నిర్దేశిత వేతనాలు ఇస్తామని ప్రకటించటం ద్వారా.. ఆ వేతనాల కోసం ఇప్పుడు పట్టభద్రులు..పోస్టు గ్రాడ్యుయేట్లు పోటీలో ఉన్నారు.

Heavy competition for liquor sales men posts in AP

ఎమ్మెల్యేల మీద ఒత్తిడి..
సూపర్‌వైజర్‌ పోస్టులకు డిగ్రీ, సేల్స్‌మన్‌ పోస్టులకు ఇంటర్మీడియట్‌ విద్యార్హతగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో కొందరు డిగ్రీ, ఇంటర్‌ మార్కులు వందకు వంద వచ్చినట్లుగా నమోదు చేశారు. ఆదివారం అధికారులు జరిపిన సర్టిఫికెట్ల పరిశీలనలో ఈ విషయం బయటపడింది. ఇలా ఎందుకు చేశారని అభ్యర్థులను ప్రశ్నించగా, తమకు వచ్చిన మార్కులు ఆన్‌లైన్‌లో పొందుపరిస్తే దరఖాస్తు తీసుకోలేదని, దీంతో ఎక్కువ మార్కులు పొందుపరిస్తే దరఖాస్తు తీసుకుందంటూ వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో మద్యం దుకాణాల్లోని పోస్టులను రాజకీయ నాయకులు, అధికారులు కలిసి భారీగా ముడుపులు తీసుకుని కొందరికి కేటాయించేశారని, అందుకే తమకు సమాచారం కూడా కొందరు అభ్యర్దులు పలు ప్రాంతాల్లో ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత పెద్ద సంఖ్యలో విడుదల చేసిన పోస్టుల్లో సచివాలయ ఉద్యోగాల కోసం తాము ఎటువంటి సిఫార్సులు చేయలేమని మంత్రులు..ఎమ్మెల్యేలు తేల్చి చెప్పేస్తున్నారు. ఇక, కనీసం మద్యం దుకాణాల్లో ఉద్యోగాల కోసమైనా తమకు సిఫార్సు చేయాలంటూ వారి కోసం పని చేసిన ద్వితీయ శ్రేణి నాయకుల నుండి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో.. అనేక మంది ఆ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మొత్తంగా ఈ వ్యవహారం చివరి నిమిషం వరకు ఎటువంటి టర్న్ తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే.

English summary
Heavy competition for liquor sales men posts in AP. Govt planning to operate own liquor shops in state from october. given notification for salesmen and supervisor posts.Graduates and post graduates hugely applied for these posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X